ప్రకాశం

స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యద్దనపూడి, జూన్ 19: యద్దనపూడి గ్రామంలో బీసీ, ఎస్సీకాలనీలకు స్వచ్ఛమైన తాగునీటిని విడుదల చేయాలంటూ యద్దనపూడిలో మహిళలు ఎంపిడిఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అధికారుల జోక్యంతో ఇన్‌చార్జి ఎండిఒ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీకాలనీ వాసి రాంబాబు మాట్లాడుతూ యద్దనపూడి ఎస్సీ, బీసీ కాలనీ లకు 25 సంవత్సరాల క్రితం తాగునీరు అందించేందుకు రెండు అంగుళాల పైపులైన్‌ను ఏర్పాటుచేశారని, అప్పట్లో జనాభా తక్కువగా ఉన్నందున నీరు సరపడా ఉండేవని, ప్రస్తుతం జనభా పెరిగినందున పంచాయతీ వారు విడుదల చేసే నీరు సరిపోవడం లేదన్నారు. కాలనీలోని అందరూ పనులకు వెళ్తున్నందున, గృహాల్లో జనాభా లేని సమయంలో నీరు సరఫరా చేస్తున్నారని, దీంతో అవసరమైన సమయంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. చెరువులో నీరు అడుగంటడం వలన ఫిల్టర్‌కాని నీరు విడుదల చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో వృద్ధులు చెరువునీటికి అలవాటు పడి ఉన్నందున, వేరు నీరు తాగడం వలన రోగాల భారీన పడుతున్నారన్నారు. నీరు విడుదల చేసే సమయంలో గ్రామాల్లో విద్యుత్ మోటార్లు ఉపయోగించడం వలన చివరి గృహాల వారికి నీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త వాటర్ ట్యాంకును నిర్మించి, నూతన పైపులైన్‌లు ఏర్పాటుచేస్తేనే సమస్య పరిష్కారమైతుందన్నారు. పరిష్కారం కాని పరిస్థితుల్లో సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ధర్నాలో సుమారు 150 మంది మహిళలు పాల్గొన్నారు.
సర్పంచి జగదీశ్వరి వివరణ:
తాగునీటి సమస్య పరిష్కార విషయమై సర్పంచి జగదీశ్వరిని వివరణ కోరగా గత నాలుగు సంవత్సరాల నుంచి వర్షాలు సక్రమంగా లేవని, గతంలో సాగర్‌కాలువ పంటలకు 6నెలల పాటు విడుదల అవుతుండేవని, ఆ సమయంలో పైపులైన్ ద్వారా అరడుగు పైపు ద్వారా ప్రతి రోజూ నీరు అందేవని, గత నాలుగు సంవత్సరాల నుంచి సాగర్ నీరు రాకపోవడంతో ప్రభుత్వం తాగునీటి కోసం విడుదల చేసే నీటి మాత్రమే పది రోజులు రాత్రింబవళ్లు చెరువులకు నింపుతున్నామన్నారు. వర్షం కురిసినప్పుడు వచ్చే వర్షపు నీటిని చెరువులకు మల్లించడం ద్వారా వచ్చే నీటితో ఇప్పటి వరకు నీటి సమస్య లేకుండా చూస్తున్నామని, అయితే నీటి సమస్యను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి తీసుకు పోగా ఎమ్మెల్యే స్పందించి బొబ్బేపల్లి సాగర్‌కాలువ వద్ద నుంచి యద్దనపూడి, చిలుకూరివారిపాలెం, ఇంజనంపాడు గ్రామాలకు తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు ప్రతిపాదనలు తయారు చేయించారన్నారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే స్వయంగా కలిసి సమస్యను వివరించారని, సానుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించినట్లు సర్పంచి తెలిపారు. ధర్నా కార్యక్రమంలో పోపూరి శ్రీనివాసరావు, పెంట్యా శ్రీరామ్‌మూర్తి, గొట్టిపాటి వెంకట్రావ్, బండ్ల సతీష్, రావిపాటి శ్రీరామమూర్తి, ఎస్టీ, బీసి కాలనీవాసులు ఉన్నారు.