ప్రకాశం

ఒంగోలు డెయిరీకి రూ.35కోట్లు రుణం మంజూరుకు క్యాబినేట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 19: ఒంగోలు డెయిరీకి రూ.35కోట్లు బ్యాంకు రుణం ఇప్పించేందుకు, దర్శిలో మినిస్టేడియం ఏర్పాటుకు 6.5 ఎకరాల మంజూరు చేస్తూ రాష్టక్య్రాబినేట్ ఆమోదం తెలిపింది. మంగళవారం రాత్రి విజయవాడలో రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అధ్యక్షతన క్యాబినేట్ సమావేశం జరిగింది. ఈసమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు హాజరయ్యారు. ఈసమావేశంలో ఒంగోలు డైయిరీకి బ్యాంకర్ల ద్వారా రూ. 35కోట్ల రుణాన్ని ఇప్పించేందుకు క్యాబినేట్ ఆమోదం తెలపటంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులు, డెయిరీ ఉద్యోగులు,కార్మికులు, పాలరైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర క్యాబినేట్‌లో రూ.35కోట్లు విడుదల చేసేవిధంగా ఆమోదం తెలపనున్నట్లు మంత్రి శిద్దా విలేఖర్లకు తెలిపారు. ఈనేపథ్యంలో డెయిరీకి నిధులు సమకూరనున్నాయి. డెయిరీకి మొదటి విడతగా ఉద్యోగులు, కార్మికులు, పాలరైతులకు నగదును చెల్లించనున్నారు. దీంతో డెయిరీ ఆర్ధికంగా గాడిలో పడనుంది. ఈపాటికే డెయిరీ చైర్మన్‌గా రాంశంకర్ నాయక్‌ను నియమిస్తూ పాలకవర్గం ఆమోదించింది. ఈనేపథ్యంలో ఆయన సారధ్యంలో ఒంగోలు డెయిరీ పాలన సాగనుంది. ప్రస్తుతం పాలుపోసేవారు లేక డెయిరీ నిరసించిపోయింది. రైతులకు బకాయిలు చెల్లిస్తే తిరిగి డెయిరీకి పాడి రైతులు పాలు పోసే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో పాడిరైతులకు మంచిరోజులు వచ్చినట్లైంది. ఇప్పటివరకు పాలరైతులు తమ బకాయిలను చెల్లించాలని డెయిరీ చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగులు కూడా జీతాలు అందక వడ్డీలకు నగదును తెచ్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డెయిరీ ఆర్ధికంగా గాడిలో పడనున్న నేపథ్యంలో అన్నివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిఇలావుండగా మంత్రి శిద్దా రాఘవరావు సొంత నియోజకవర్గమైన దర్శిలో మినిస్టేడియం ఏర్పాటుచేయనున్నారు. ఈపాటికే అంతర్జాతీయ స్థాయి డ్రైవింగ్ స్కూలును మంత్రి శిద్దా మంజూరు చేయించుకున్నారు. తాజా 6.05 ఎకరాల్లో మినీస్టేడియం ఏర్పాటు వలన క్రీడాపరంగా నియోజకవర్గం అభివృద్ధి చెందనుంది. ఈపాటికే దర్శి నియోజకవర్గంలో సుమారు రూ.18వందల కోట్ల వరకు అభివృద్ధి పనులను శిద్దా చేశారు. నియోజకవర్గ పరిధిలోని దర్శి, ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ, తాళ్ళూరు మండలాల్లో అభివృద్ధిపనులను శిద్దా చేశారు. మొత్తంమీద రాష్టక్య్రాబినేట్ తీసుకున్న నిర్ణయాలతో జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.