ప్రకాశం

చేనేతలకు, మత్స్యకారులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలెం, జూన్ 19: చేనేతలు మత్స్యకారులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఐటి శాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. మండలంలో మంగళవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ చేనేత పురిలో రూ.2.06కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ భవనం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకం ఆవిష్కరించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టి 14 నెలలు పూర్తి అయిందని, అన్ని గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు మొదట ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. చేనేతలు ఇతర కులవృత్తులను ప్రోత్సహించాలని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ఉభయ రాష్ట్రాల్లోని కార్యకర్తల ఇళ్లలో వివాహా వేడుకలకు అందిస్తామన్నారు. చీరాల ప్రాంత చేనేత వస్త్రాల్లో నాణ్యత, నూతన డిజైన్లు అద్భుతంగా ఉంటాయని ప్రశంసించారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేలు ఆదాయం వచ్చేలా అవకాశాలు కల్పించడానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు, చేనేతల రుణమాఫీ , డ్వాక్రా మహిళలకు రూ.10వేలు పెట్టుబడి నిధులు, అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించడం వంటి ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు అందించిన రూ.200 పింఛను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 రెట్లు పెంచి రూ.1000 అందిస్తున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 అంశాలను సాధించేందుకు కేంద్రప్రభుత్వం తో పోరాడిన ఏకైక పార్టీ టీడీపీ అని రాష్ట్ర సమస్యలపై ఓటింగ్ కోసం టీడీపీ ఎంపీలు పట్టుబడితే కేంద్ర ప్రభుత్వం పారిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 25మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావల్సిన అన్ని ప్రాజెక్టులు సాధించుకో వచ్చునన్నారు.
రాష్ట్ర మార్కెటింగ్, పశుసంవర్థక శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు రూ.500కోట్లతో మార్కెటింగ్ ఇంటర్ వెన్‌షన్ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల పండించిన కందులు, శనగలు వంటి పంటలకు గిట్టుబాట ధర కరవైనప్పుడు ప్రభుత్యం తరఫున తగిన మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటామన్నారు. అనంతరం స్వయం సహాయక బృందాలకు మంజూరైన రూ.10.35కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా స్క్యాచ్ అవార్డు కింద పర్సన్ ఆఫ్‌ద ఇయిర్ అవార్డుకు ఎంపికైన మంత్రి లోకేష్‌ను వివిధ శాఖల అధికారులు ఘనంగా సత్కరించారు. స్థానిక శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 24 పంచాయతీల్లో రహదారుల నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని మంత్రి దృష్టికి తెచ్చారు. చీరాల మండలానికి రూ.25కోట్లు, వేటపాలెం మండలానికి రూ.52కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, శాసన సభ్యులు దామచర్ల జనార్థన్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, కదిరి బాబురావు, ఎం అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, ఎస్ ఎన్‌పాడు మాజి ఎమ్మెల్యే విజయ్‌కుమార్, కలెక్టర్ వి వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, వివిధ శాఖల, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రామాపురం: అక్కాయిపాలెం పంచాయతీ రామాపురంలో జరిగిన కార్యక్రమంల్లో మంత్రులు నారా లోకేష్, మత్స్య శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావులు పాల్గొని ప్రభుత్వం ద్వారా మంజూరైన పలు పథకాలనున ప్రయోజనాలను మత్స్య కారులకు అందజేశారు. 360 కుటుంబాలకు రూ.4వేల వంతున వేట విరామ భృతి, ఆరుగురికి ఫైబర్ బోట్లు, 38 వలలు, 6 లగేజి ఆటోలు, వంద మత్స్యకార గ్రూపులకు రూ.50లక్షల రివాల్వింగ్ ఫండ్ చెక్కు, 28 మందికి మత్స్యకార పింఛన్లు అందించారు. వాడరేవులో షిప్పింగ్ హార్భర్ ఏర్పాటుకు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోరగా మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సహకరించే పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ఎంపిపి బండ్ల తిరుమలదేవి, సర్పంచిలు తుపాకుల నాగమ్మ, యర్రా శివశంకర్ పలువురు ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.