ప్రకాశం

నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల,జూన్ 21: ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సహకారంతో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం మేదరమెట్లగ్రామంలో రెండుకోట్ల రూపాయల ఎస్‌ఆర్ నిధుల వ్యయంతో నిర్మించబోయే సిమెంటు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన విచ్చేసారు. ముందుగా మేదరమెట్ల గ్రామంలోని కొరిశపాడు పోలీసుస్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు స్టేషన్ వద్ద గ్రామ మాజీ సర్పంచ్ కర్నాటి పూర్ణచంద్రరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన బహిరంగసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు కొంతమంది కొన్ని నెలలుక్రితం మేదరమెట్ల - తమ్మవరం రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ అద్దంకిరోడ్డు దుస్థితిని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తాను ఈసమస్యను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి రెండుకోట్లరూపాయల అంచనాతో ఈ సిమెంటు రోడ్డు నిర్మాణానికి కేటాయింపు చేశానని తెలిపారు. గ్రామస్తులు తమవంతుగా స్వచ్ఛందంగా ఆక్రమణలనుండి వైదొలిగి సిమెంటురోడ్డు, సైడుకాల్వల నిర్మాణాలకు తమవంతుగా సహకరించాలని కోరారు. అలాగే తమ్మవరం రోడ్డు నిర్మాణం 95శాతం పూర్తిఅయినా కొద్ది దూరం ఆక్రమణలు తొలగించనందున రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవటంతో లక్ష్యం నేరవెరలేదన్నారు. సభలో ఉన్న తహశీల్దార్‌ను త్వరలో ఆక్రమణలు తొలగించి రోడ్డునిర్మాణం పూర్తిఅయ్యేలా చూడాలని ఆదేశించారు. తహశీల్దార్ శివనాగిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఆ రోడ్డు విస్తీర్ణం పూర్తి వివరాలు రాలేదని, ఇటీవలే ఆ రోడ్డు గురించి పూర్తివివరాలు ఉన్న పత్రాలను సేకరించామన్నారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలం ఉందని, త్వరలోనే సర్వే చేయించి పూర్తివిస్తీర్ణ వివరాలను ఆర్‌అండ్‌బి అధికారులకు అందించి, మిగిలిన రోడ్డు పూర్తయ్యేలా చూస్తామని గొట్టిపాటికి తెలియజేశారు. గ్రామస్తులు తాగునీటి ఎద్దడి గురించి ఆయన దృష్టికి తీసుకురాగా ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లోనే ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి గుండ్లకమ్మ నీటిని పైపుల ద్వారా గ్రామానికి అందిస్తామని హామీ ఇచ్చారు.అలాగే గ్రామ చెరువునుకూడా పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా అధికారులతో చర్చించి చెరువును నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొరిశపాడు మండలంలో ఆరుముంపు గ్రామాలు ఉన్నాయని, వారికి పోలవరం ముంపు బాధితుల లాగా రూ.2.40లక్షలతో ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఐదువేలకు పైగా పేదలకు గృహాలను నిర్మించామని, తొమ్మిది వేలకు పైగా పింఛన్లు పంపిణి చేశామన్నారు. 2300కు పైగా సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణి చేశారు. ఇంకా అర్హులైన వారికి ఇళ్లు, పింఛన్లను పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహకారంతో అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు పెద్దఎత్తున చేపట్టి నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమంత్రి సహకారంతో పూర్తిచేస్తామన్నారు. ఈకార్యక్రమంలో కొరిశపాడు జడ్‌పిటిసి జంపు రావమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు గోలి హరిబాబు, ఆర్‌అండ్‌బి డిఇ శ్రీనివాసరావు, ఎఇ భాస్కరరావులతోపాటు పలువురు అధికారులు, మండలంలోని గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.