ప్రకాశం

30న నెల్లూరులో దళిత తేజం - తెలుగుదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూన్ 21 : ఈనెల 30వ తేదిన నెల్లూరులో దళిత తేజం - తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి , ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు దళిత తేజం - తెలుగుదేశం ముగింపు కార్యక్రమం సందర్భంగా లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత వర్గాల వారి పట్ల ఎంతో ప్రేమ చూపుతున్నారని, దళితుల అభివృద్ధి- సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి 22 మంది దళిత ముఖ్యనేతలందరినీ రాష్టప్రతి కోవింద్ వద్దకు పంపారని, అట్రాసిటీ యాక్టు పై రాష్టప్రతితో మాట్లాడామన్నారు. 1989 యాక్టు చట్టాన్ని నాశనం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. దేశంలో ఎక్కడా చూసినా దళితులపై బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని, ఇటీవల గుజరాత్‌లో ఒక దళితుడ్ని ఆర్‌యస్‌యస్ వాదులు మట్టు పెట్టారన్నారు. ఇప్పటి వరకు కేంద్రాన్ని ఎదురించింది ఎవ్వరూ లేరని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై యుద్ధం ప్రకటించారన్నారు. దీంతో దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని అనేక దేశా లు ఆంధ్రప్రదేశ్‌పై చూస్తున్నాయన్నారు. 120 సంవత్సరాల అంబేద్కర్ జయం తి కార్యక్రమాన్ని ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుందని, 20 ఎకరాల్లో వంద కోట్ల రూపాయలతో 125 అడుగుల అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా వైకాపా నేతలు మాత్రం కేంద్రాన్ని విమర్శించకుండా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. ప్రత్యేక హోదా అంశం లో రాష్ట్ర ప్రభుత్వం పక్కా క్లారిటీగా ఉందని, ప్రతిపక్ష పా ర్టీలు తూతూ మంత్రంగా పోరాటాలు చేస్తున్నాయన్నారు. బీజేపీ అంతమే తెలుగుదేశం పంతంగా ముందుగా వెళ్తున్నామన్నారు. దేశంలో నియంత పాలన సాగుతుందని, అలాంటి నాయకులకు భవిష్యత్తు ఉండదన్నారు. ఇప్పటికే మోదీని మార్చేందుకు ఆర్‌యస్‌యస్‌లోని ఒక వర్గం బయలుదేరిందన్నారు. ప్రజలు అంటేనే భయం, భక్తి ఉన్న నాయకుడే సేవకుడిగా ఉంటారన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం ప్రారంభం అయిందని, రైల్వే జోన్ కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది కుటుంబాల వారు, కోటి మంది దళితులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారన్నారు. ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి పేద, దళిత వ్యవసాయదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.