ప్రకాశం

యోగా చేయటం ఆరోగ్యానికి మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 21:యోగా చేయటం ఆరోగ్యానికి మంచిదని జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. గురువారం స్థానిక పోలీసు పెరేడ్ మైదానంలో జిల్లా యంత్రాంగం, ఆయూష్ ఆధ్వర్యంలో నాల్గవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మాగుంట ప్రారంభించారు. తొలుత పతంజలి యోగా ఫట్, వివేకానంద హఠయోగ, ఆయూష్ శాఖ, యోగా గురువులు వై బాలసుబ్రమణ్యం, డి వీరాంజనేయులు, వై కోటిరెడ్డి వేదిక పైనుండి యోగా విధానక్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలందరిచేత చేయించారు. ఈసందర్భంగా మాగుంట మాట్లాడుతూ యోగా ప్రాచీన భారతదేశ సంప్రదాయంనుండి వచ్చిన గొప్పవరమన్నారు. మానవ శరీరం, ఆలోచన, లక్ష్యాలు, చర్యలు, జీవిత సాఫల్యాలు మనిషికి ప్రకృతితో మమేకం చేయటమే కాక పరిపూర్ణ ఆరోగ్యాన్ని, మంచి భావనలు కలిగించేదే యోగా అన్నారు. గత 20 సంవత్సరాలనుండి యోగా చేయటమే కాక ప్రతిసారి యోగా దినోత్సవానికి హాజరు అవుతున్నానని, తన ఆరోగ్యం ఇలా ఉండేందుకు కారణం యోగానేనని తెలిపారు. యోగా చేయటం వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని, దీర్ఘకాలిక వ్యాధులకు సరైన మందు యోగా అని అన్నారు. ఇటీవల కాలంలో ప్రజలు యోగా వైపు మరలడం సంతోషించదగ్గ పరిణామన్నారు. రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అలసట లేకుండా రోజుకు 18 గంటలపాటు పనిచేయటంలో రహస్యం ఆయన రోజూ యోగా చేయటంతోపాటు ఆహార నియమాలు పాటించటమేనని మాగుంట తెలిపారు. అనంతరం జిల్లా అధికారులకు వేదికమీద వున్న పెద్దలు జ్ఞాపికలు బహూకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్‌పి సత్యఏసుబాబు,జాయింట్‌కలెక్టర్ -2 డి మార్కండేయులు, సిపిఒ కెటి వెంకయ్యతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు మురళీ, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, శింగయ్య, రవి, సిహెచ్ హరిప్రసాదుతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 25వ తేదీనుండి చీమకుర్తిలో కుంభాభిషేక మహోత్సవం
*మంత్రి శిద్దా రాఘవరావువెల్లడి
చీమకుర్తి,జూన్ 21:ఈనెల 25వ తేదీనుండి చీమకుర్తి హరిహర క్షేత్రంలో శ్రీహరిహర క్షేత్ర అష్టబంధన మహా కుంభాభిషేక మహోత్సవం కార్యక్రమాలు ప్రారంభమవుతాయని రాష్ట్రఅటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. గురువారం చీమకుర్తి హరిహర క్షేత్రంలో ఈనెల 25వ తేదీనుండి 30వతేదీవరకు అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం, కార్యక్రమాల బ్రోచర్‌ను శిద్దా వెంకటేశ్వర్లు,వెంకటసుబ్బమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో మంత్రి సోదరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ ఈనెల 25వతేదీనుండి 30వతేదీవరకు జరిగే కార్యక్రమాలకు జిల్లాలోని ప్రజలు అందరూ కుటుంబ సభ్యులతో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 25వతేదీన తిరువీధి ఉత్సవంతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈకార్యక్రమంలో శిద్దా వెంకటేశ్వరరావు, శిద్దా వెంకట్రావు, శిద్దా పాండురంగారావు, శిద్దా సుధాకర్, శిద్దా సురేష్, కాట్రగడ్డ రమణయ్య, సూరంపల్లి హనుమంతరావు, మేదరమెట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.