ప్రకాశం

ఒంగోలు ఎంపి సుబ్బారెడ్డి రాజీనామా ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 21:రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనకోసం వైకాపాకు చెందిన ఐదుగురు పార్లమెంటుసభ్యుల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహజన్ గురువారం ఆమోదించారు.రాజీనామాలను ఆమోదించిన వారి జాబితాలో ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఇకపై సుబ్బారెడ్డి మాజీ పార్లమెంటు సభ్యులుగా కొనసాగనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఏప్రిల్ ఆరవ తేదీనే ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి తన రాజీనామా లేఖను సుమిత్ర మహజన్‌కు అందించారు. అప్పటినుండి రాజీనామాల వ్యవహరం చర్చకు దారితీస్తూనే ఉంది. ఇటీవల రాష్ట్రానికి ఐదుగురు పార్లమెంటు సభ్యులు లోక్‌సభ స్పీకర్ పిలిచి మరోసారి ఆలోచించాలని కోరారు. కాని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నామని అందువలన ఆమోదించాలని కోరారు. చివరకు వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించటంతో రాజకీయంగా సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇదిలాఉండగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనకోసం వైసీపీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దఎత్తున ఆందోళన బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాత్రం త్వరలోనే వెలుగొండప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వర్గీయుల ద్వారా సమాచారం.
కాగా ఒంగోలు పార్లమెంటుసభ్యునిగా సుబ్బారెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన ఎంపీ నిధులతో ఆయన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు, కొండెపి, కనిగిరి, దర్శి,మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అదేవిధంగా జిల్లాలో నెలకొన్న ఫ్లొరైడ్ సమస్యను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కేంద్రబృందం వచ్చేవిధంగా చర్యలు తీసుకున్నారు. కాగా కిడ్నీవ్యాధిగ్రస్తుల సమస్యలపై కూడా ఆయన స్పందించారు. ప్రధానంగా కిడ్నీవ్యాధిగ్రస్తులు ఉన్న ప్రాంతాల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించేలా కృషిచేశారు. పొగాకు, కంది, శనగపంటల రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర,రాష్ట్రప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. పశ్చిమప్రాంతంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తంమీద ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఆమోదించటంతో ఆయన ఇకపై ప్రత్యక్ష పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.