ప్రకాశం

జిల్లాలో 60 ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూన్ 23: జిల్లాలో 60 ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలు అందిస్తున్నట్లు డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యట్రస్టు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ తన్నీరు రాజేష్‌కుమార్ తెలిపారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఎంప్లాయిస్ హెల్త్‌స్కీం జిల్లా కార్యనిర్వాహక కమిటీ, నెట్‌వర్క్ ఆసుపత్రుల వైద్యులతో సంయుక్త సమావేశం స్థానిక రిమ్స్ వైద్యశాలలో జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 36 కార్పొరేట్ ఆసుపత్రుల్లో, 16 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎనిమిది దంత వైద్య ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని అమలుచేస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పాటుచేసిన ఎంప్లాయిస్ జిల్లా కార్యనిర్వాహక కమిటీతో తొలి సమావేశాన్ని ఏర్పాటుచేయటం సంతోషంగా ఉందన్నారు. ఈకమిటీ ఇచ్చే సలహాలు, సూచనలతో ఎంప్లాయిస్ హెల్త్‌స్కీంను మరింత సమర్ధవంతంగా అమలుచేసేందుకు కృషిచేస్తామన్నారు. ఎక్కడైనా ఉద్యోగి తమ అర్హత కార్డుతో ఆసుపత్రిలోని వైద్యమిత్రను కలవాలని, ఏదైనా సమస్య ఎదురైతే వైద్యమిత్ర కౌంటర్ వద్ద ఉన్న జిల్లా కోఆర్డినేటర్, లేదా జిల్లా మేనేజర్‌కు ఫోన్‌చేసి చెప్పాలన్నారు. రిమ్స్ వైద్యశాలలో 25 దీర్ఘకాలిక వ్యాధుల కోసం మందులు ఇవ్వటం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఆసుపత్రుల్లో కూడా ఈపథకాన్ని అమలుచేయాలని కోరారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ ట్రస్టు జిల్లా సిబ్బంది ఉద్యోగుల కోసం అవగాహన తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లాలోని అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎన్‌టిఆర్ వైద్యశాల జిల్లా మేనేజరు కె నవీన్, టీం లీడర్స్ వెంకటరావు, నారాయణ, కందుకూరు డివిజన్ టీం లీడర్ కందుల పీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.