ప్రకాశం

జిల్లాలో మందకొడిగా పొగాకు కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 23: జిల్లాలోని పొగాకు బోర్డు వేలం కేంద్రాలలో పొగాకు కొనుగోళ్ళు ప్రస్తుతం మందకొడిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వేలం కేంద్రాలలో జరుగుతున్న పొగాకు కొనుగోళ్ళలో పొగాకు వ్యాపారులు ఎక్కువ మంది పొల్గొంటున్నప్పటికీ తమకు పొగాకు ఎగుమతి ఆర్డర్లు ఇంకా సరిగా రాలేదంటూ వేలం కేంద్రాలలో పొగాకు వ్యాపారులు కుమ్మక్కై పొగాకు రైతులకు ధరలు పెంచకుండా నెమ్మదిగా కొనుగోలు చేస్తున్నట్లు పొగాకు రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వేలం కేంద్రాలలో నాణ్యత కలిగిన పొగాకుకు మాత్రం ఒక కేజికి గరిష్ట ధర 166 రూపాయల వరకు ధర ఇస్తున్న వ్యాపారులు అదే మధ్య రకం పొగాకు , లోగ్రేడ్ పొగాకుకు మాత్రం ధరలు బాగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. అది కూడా నాణ్యత కలిగిన పొగాకు ఒక కేజికి గరిష్ట ధర 166 రూపాయల వరకు ఒకటి , రెండు బేళ్ళకు ధర ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేసి మిగిలిన బేళ్ళకు ధర బాగా తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు పొగాకు రైతులు, రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి మధ్య రకం పొగాకు కూడా నాణ్యత కలిగిన పొగాకు దీటుగా ఉన్నప్పటికి పొగాకు వ్యాపారులు ఆ పొగాకును ఒక కేజికి గరిష్ట ధర 120 రూపాయలు నుండి 150 రూపాయలు లోపు ధర ఇచ్చి కొనుగోలు చేస్తూ రైతులను నష్టాలకు గురిచేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇక లోగ్రేడ్ పొగాకును అయితే వ్యాపారులు ఒక కేజి 80 రూపాయల లోపు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 50శాతం పొగాకు కొనుగోళ్లు అమ్మకాలు జరిగాయని, ఇక రైతుల వద్ద కేవలం 50 శాతం పొగాకు మాత్రమే ఉందన్నారు. ఇందులో నాణ్యత కలిగిన పొగాకు ఇప్పటికే ముప్పాతిక శాతం పొగాకు కొనుగోళ్లు జరగగా, ఇక రైతుల వద్ద మిడిల్ గ్రేడ్, లోగ్రేడ్ పొగాకు మాత్రమే రైతుల వద్ద ఉంది. అయితే పొగాకు వ్యాపారులు మాత్రం మాకు ఇంకా పొగాకు ఎగుమతి ఆర్డర్స్ సరిగా రాలేదంటూ పొగాకుకు ఏమాత్రం ధరలు పెంచకుండా కొనుగోలు చేస్తున్నారు. అయితే రైతు సంఘాల నాయకులు మాత్రం పొగాకు వ్యాపారులకు ఎప్పుడో పొగాకు ఆర్డర్స్ వచ్చాయని, అయితే పొగాకు వ్యాపారులు వేలం కేంద్రాలలో కుమ్మక్కై ధరలు పెంచడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల పొగాకు బోర్డు కార్యదర్శి పొగాకు వ్యాపారులతో సమావేశమై పొగాకు కొనుగోళ్లను వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచిండంతోపాటు పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలని వ్యాపారులను కోరారు. అయినప్పటికీ పొగాకు వ్యాపారులలో ఏమాత్రం చలనం లేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది పొగాకు రైతులకు పొగాకు సాగుతోపాటు, పొగాకు ఉత్పత్తి ఖర్చులు గత ఏడాది కంటే అధనంగా పెరిగింది. పెరిగిన ఖర్చులు ప్రకారం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే నాణ్యత కలిగిన పొగాకు ఒక కేజికి గరిష్ట ధర 170 రూపాయలకు పైగా ధర వస్తేనే గిట్టుబాటు ధర వచ్చినట్లు అవుతుంది. అలాంటిది వేలం కేంద్రాలలో ఒకటి, రెండు బేళ్లకు ఒక కేజికి 166 రూపాయల వరకు ధర ఇచ్చి కొనుగోలు చేస్తూ మిగిలిన పొగాకుకు ధర బాగా తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు పొగాకు రైతులు తెలియజేస్తున్నారు. జిల్లాలో మొత్తం 12 పొగాకు బోర్డు వేలం కేంద్రాలు ఉండగా ఈ ఏడాది జిల్లాలోని పొగాకు రైతులకు సుమారు 81 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేయాలని బోర్డు లక్ష్యంగా నిర్ణయించింది. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో జిల్లాలో సుమారు 75 మిలియన్ కేజీల లోపు రైతులు పొగాకు పంటను ఉత్పత్తి చేసినట్లు పొగాకు బోర్డు అధికారుల ద్వారా సమాచారం. బోర్డు ఇచ్చిన ఇండెంట్ కన్నా పొగాకు రైతులు పొగాకు పంటను ఉత్పత్తి చేసినప్పటికీ పొగాకు ధరలు మాత్రం పెంచడం లేదని పొగాకు రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు పొగాకు వ్యాపారులు జిల్లాలోని 12 పొగాకు బోర్డు వేలం కేంద్రాలలో సుమారు 38 మిలియన్ కేజీల పొగాకును మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా రైతుల వద్ద సుమారు 31 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పొగాకు కొనుగోళ్లు కూడా మందకొడిగా జరుగుతుందటంతో ఈ ఏడాది సెప్టెంబర్ మాసం వరకు కొనుగోలు జరిగే అవకాశం ఉంది. దీని కారణంగా రైతుల వద్ద ప్రస్తుతం ఉన్న పొగాకు కలర్ ఇంకా తగ్గే అవకాశం ఉందని, దీంతో పొగాకు వ్యాపారులు పొగాకు ధరలు బాగా తగ్గిస్తారన్న ఆందోళనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ పేరుతో ఒక సంవత్సరానికి సుమారు 19వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నా పొగాకు రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం అని వాపోతున్నారు. ఇప్పటికైనా పొగాకు బోర్డు అధికారులు, ప్రభుత్వం స్పందించి పొగాకు వ్యాపారులపై వత్తిడి తీసుకొచ్చి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.