ప్రకాశం

ఎక్కడ చూసినా మురుగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జూలై 12: గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త, మురుగే ఉంటోందని గ్రామస్థులు వైకాపా ఇన్‌ఛార్జి యడం బాలాజీకి మొరపెట్టుకున్నారు. మండల పరిధిలోని ఈపూరుపాలెం ఇందిరానగర్‌లో గురువారం గడప గడపకు వైకాపా కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తమ పార్టీని బలపర్చాలని ఆయన గ్రామస్థులను కోరారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు ఆయనకు తమ సమస్యలు విన్నవించారు. వీధుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని బాలాజీకి వివరించారు. గతంలో రెండు వారాలకోసారి అయినా చెత్త తొలగించేవారని, ప్రస్తుతం పట్టించుకునే వారే లేరని వాపోయారు. దానికితోడు వర్షాకాలం మొదలైనందున దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతాయన్న ఆందోళనలో ఉన్నట్లు ఆయనకు తెలిపారు. బాలాజి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే గ్రామాల్లో సమగ్ర పారిశుద్ధ్య విధానం అమలు చేస్తామన్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బడికి వెళ్లే పిల్లలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున, ఐదు నుంచి పదో తరగతి వరకు రూ.750 చొప్పున ఇద్దరు పిల్లలకు చెల్లిస్తామని తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. అదేవిధంగా వసతిగృహాల్లోని విద్యార్థులకు మెస్ ఛార్జీలు కూడా పెంచుతామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. కావున తమ పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోలి ఆనందరావు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు, పిన్నిబోయిన రామకృష్ణ, అధికార ప్రతినిధి యడం రవిశంకర్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు సాతులూరి సత్యనారాయణ, మండల మహిళా అధ్యక్షురాలు మనోహరి, గ్రామ అధ్యక్షుడు గుద్దంటి సుధాకర్, గోలి వెంకట్రావు, పొట్టేటి సుబ్బయ్య, సయ్యద్ అహ్మద్, సయ్యద్ నాగూర్, షేక్ నజీర్, పడవల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

‘రైతులు ప్రకృతి సాగును ఉద్యమంలా చేపట్టాలి’
మేదరమెట్ల, జూలై 12 : గ్రామాల్లోని రైతులు పెట్టుబడులు తగ్గి అత్యధిక లాభాలను వనగూర్చే ప్రకృతి సాగును ఉద్యమంలా చేపట్టాలని వ్యవసాయ సహాయ సంచాలకులు పీవీ శ్రీరామ్మూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఆయన వ్యవసాయాధికారులు, సిబ్బందితో కలిసి కొరిశపాడు మండలంలో ప్రకృతి సాగు చేస్తున్న యర్రబాలెం, అనమనమూరు, బొడ్డువానిపాలెం, కొరిశపాడు, కుర్రావానిపాలెం గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతుల నుండి ప్రకృతి సాగు లోని సాధక బాధలను రాబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో అనవసర ఖర్చులు తగ్గించడంతో పాటు విపత్తులను ఎదుర్కోవాలంటే సాంప్రదాయ వ్యవసాయానికి సాంకేతికతను జోడించి ప్రకృతి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులతో పాటు మన్నికైన పంటలను కూడా పండించవచ్చని తెలిపారు. తద్వారా రైతులకు అధిక లాభాలు కలుగుతాయన్నారు. ఏవో ప్రసాద్‌రావు మాట్లాడుతూ మండలంలో ప్రకృతి సాగు గురించి గోడల మీద రాతలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా రైతుల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నామన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో పికో ప్రాజెక్టుల ద్వారా, ర్యాలీల ద్వారా ప్రచారాన్ని చేస్తూ గత సంవత్సరం ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభపడిన రైతుల ద్వారా ఆ గ్రామాల్లోని మరికొంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేలా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఏడీఏ మాలకొండారెడ్డి, డీపీఎం సుభాషిని, ఎంపీఈవోలు, సీఆర్‌పీలు, రైతులు సామిరెడ్డి, నాగేశ్వరరావు, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాలకు కారణమైన ఆక్రమణల తొలగింపు
మేదరమెట్ల, జూలై 12 : ఆటో ప్రమాదంలో ఈ నెల 11వ తేదీన మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోడానికి కారణమైన ఆక్రమణలను జాతీయ రహదారిపై నుంచి మేదరమెట్ల పోలీసులు గురువారం యంత్రాల సహాయంతో తొలగించారు. ప్రమాదం జరిగిన తరువాత ఆ కారణాలను విచారించేందుకు దర్శి డీఎస్పీ బుధవారం మేదరమెట్లకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ రహదారిపై వచ్చిన వ్యాపార బంకులు, పందిళ్లను తొలగించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం అద్దంకి సిఐ హైమారావు, మేదరమెట్ల ఎస్‌ఐ వై పాండు రంగారావు, పోలీసు సిబ్బంది జాతీయ రహదారి విస్తరణ సిబ్బందితో కలిసి రోడ్డు మీదకు వచ్చిన ఆక్రమణలను తొలగించారు.