ప్రకాశం

‘డీఎస్సీని వెంటనే ప్రకటించి భర్తీచేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 12 :డీఎస్సీని వెంటనే ప్రకటించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ డైఫీ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డైఫీ జిల్లా కార్యదర్శి కిరణ్ అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా హాజరైన జన విజ్ఞాన వేదిక నాయకులు ఏవీ పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసినట్లు ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో అనేక రకాల ఖాళీ పోస్టులు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. అదేవిధంగా సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీఈడీ, డీఈడీ విద్యార్థుల మధ్య ఘర్షణ పెడుతుందన్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథ్ కమిటీ చెబితే ఈ నాలుగేళ్లలో 18వేల 926 పోస్టులు మాత్రమే భర్తీ చేసిందన్నారు. యువత నిరుద్యోగ సమస్యపై ఉద్యమించాలన్నారు. అనంతరం జనసేన సేవాదళ్ కన్వీనర్ రావూరి బుజ్జి, కెవిపిఎస్ జిల్లాకార్యదర్శి బి రఘురాం, డైఫీ జిల్లా అధ్యక్షుడు కెఎఫ్ బాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి సిహెచ్ వినోద్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైఫీ నాయకులు డి వెంకటేష్, జి గోపాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

‘గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి’
సంతనూతలపాడు, జూలై 12 : గ్రామాల్లోని పలు పంచాయితీల్లో సర్పంచులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో ఉమాదేవిని జెడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు, గుమ్మలంపాడు సొసైటీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, టీడీపీ సీనియర్ నాయకులు చిన్నారావులు వివరించారు. మండలం నుంచి ఎంపీ నిధులకు, ఎస్‌డిఎఫ్ నిధులకు ఎన్‌ఆర్‌ఈజిఎస్ కన్వరెన్జీసీ ప్రపోజల్స్‌కు మండల తీర్మానాలు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లోపించిందని తెలిపారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఎంపీడీవోను కలిసిన వారిలో సర్పంచులు కె విజయమ్మ, శీలం రామారావు, ఎన్ రాఘవరావు, నాయకులు పి వెంకట్రావు, రాఘవ, ఆర్ సీతారామయ్య, పరశురామిరెడ్డి, కె శరత్, ఎం వెంకట్రావు, గోపి, వి యలమంద తదతరులు ఉన్నారు.
యస్‌యన్‌పి -1 : గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని నూతన ఎంపీడీవోకు వివరిస్తున్న జెడ్పీటీసీ తదితరులు

‘యాదవ ఆత్మీయ సభకు భారీగా తరలిరావాలి’
సంతనూతలపాడు, జూలై 12 : ప్రపంచంలోని అత్యంత ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల-తిరుపతి 47వ దేవస్థాన కమిటీ చైర్మన్‌గా పి సుధాకర్ యాదవ్‌ను నియమించినందుకు ఈ నెల 22వ తేదీన ఒంగోలులోని తాతా కల్యాణ మండపంలో జిల్లా యాదవుల సమక్షంలో ఘనంగా సన్మానించనున్నట్లు జడా బాలనాగేంద్రం తెలిపారు. అందులోభాగంగా జన సమీకరణలో భాగంగా గురువారం సంతనూతలపాడులో ఏర్పాటు చేసిన యాదవ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అత్యంత శక్తివంతమైన తిరుమల-తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా యాదవ సామాజిక వర్గానికి కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా యాదవులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జె రత్తయ్య, సుధాకర్, రావుల ధనలక్ష్మి, కె నాగేశ్వరరావు, వి అంకమ్మరావు, విజయసారధి, రావులపల్లి సురేష్, కె వెంకట్రావు, బాపట్ల వెంకట్రావు, శ్రీకాంత్, ఎన్ ఆంజనేయులు, ఎ రవీంద్రబాబు, జి శ్రీకాంత్, కె వెంకట్రావు, ఎ శబరి తదితరులు పాల్గొన్నారు.