ప్రకాశం

కందుకూరు వైకాపాలో వర్గవిబేధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, జూలై 12: మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైకాపాలో చేరి 24 గంటలు గడవక ముందే కందుకూరు వైకాపాలో వర్గవిబేధాలు పొడసూపినట్లు చర్చ కొనసాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహ కమిటీని గురువారం మార్పు చేయడంతో ఈ చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. వైకాపా పట్టణ అధ్యక్షులుగా కొనసాగుతున్న షేక్ రఫీ ఆధ్వర్యంలో కొందరు వైఎస్‌ఆర్ విగ్రహ కమిటీని మార్పుచేస్తూ పాత కమిటీ శిలాఫలకాన్ని తొలగించి ఆ స్థానంలో నూతన కమిటీ శిలాఫలకాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో వైకాపా పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, షేక్ సుల్తాన్, షేక్ యాసిన్‌బాషా, షేక్ రహీమ్‌బాషా, సయ్యద్ సుభాని, షేక్ మస్తాన్‌బాషా, మొగల్ గౌస్‌బాషా, షేక్ రియాజ్‌బాషాలకు స్థానం దక్కింది. పాత కమిటీ గడువు మూడేళ్ల క్రితమే పూర్తయినందువల్ల నూతన కమిటీని ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు తెలుపుతుండగా, మూడేళ్లుగా మార్చని కమిటీని మహీధర్‌రెడ్డి వైకాపాలో చేరగానే మార్చడం పట్ల చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా మహీధర్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకున్న మరుసటి రోజునే విగ్రహ కమిటీలో పేర్లు మార్చడం, కొందరి పేర్లు తొలగించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్‌ఆర్ విగ్రహ నూతన కమిటీలో ముస్లిం మైనార్టీలకే తప్ప ఇతర సామాజిక వర్గాల వారికి స్థానం లభించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర, జిల్లా అధినాయకత్వం చొరవ తీసుకుని వైకాపాలోని రెండు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చి ఆదిలోనే వర్గ విబేధాలకు చెక్ పెట్టాలని పార్టీ శ్రేయోభిలాషులు కోరుతున్నారు.

బియ్యం అక్రమ రవాణదారులపై కేసులు నమోదు
* డివైఎస్పీ రామాంజనేయులు స్పష్టం
మార్కాపురం, జూలై 12: పట్టణంలో ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం అక్రమ వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు మార్కాపురం డివైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో 360 బస్తాలు స్వాధీనం చేసుకున్న సంఘటనలో ఐదుగురు, ఎస్వీకెపి కళాశాల వెనుకభాగంలో కోళ్ళఫారంలో నిల్వ ఉంచిన 485 బస్తాల బియ్యంకు సంబంధించి నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈసంఘటనకు సంబంధించి ఛీటింగ్, పిడిపిఎస్, నిత్యావసర వస్తువుల అక్రమ రవాణా చేస్తున్న సంఘటనపై సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు, ఆ శాఖ పరిధిలో వారు తీసుకోవాల్సిన చర్యలు వారు తీసుకుంటారని, తాము మాత్రం మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు రామాంజనేయులు తెలిపారు. ఎక్కడైనా ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం అక్రమంగా నిల్వ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, పేదల కోసం ప్రభుత్వం బియ్యాన్ని సరఫరా చేస్తుంటే కొందరు అక్రమ వ్యాపారులు వాటిని నల్లబజారుకు తరలించడం అన్యాయమని, ఇలాంటి సమాచారం ఉంటే పట్టణ స్థాయిలో సిఐ, పట్టణ ఎస్సై, గ్రామీణస్థాయిలో రూరల్ ఎస్సైకి సమాచారం అందించాలని తెలిపారు.