ప్రకాశం

జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 12 : ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించి, జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే రూ.10 వేల కోట్ల నిధులు కోరుతూ ఈ నెల 22న జరిగే ప్రకాశం జిల్లా రాజకీయ సదస్సును జయప్రదం చేయాలంటూ గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద వాపమక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు టి గోపాలరెడ్డి, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ షంషీర్ అహ్మద్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కూడా ఇటీవల తాము అర్జీ అందజేశామని తెలిపారు. అసెంబ్లీలో ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్ట్‌కు, రామాయపట్నం పోర్టుకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. కనిగిరి ప్రాంతంలో నిమ్జ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా చూడాలని ఆయన కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రకాశం జిల్లాను రాజకీయ కోణంలో చూస్తూ నిధులు కేటాయించడంలో వివక్షత చూపుతున్నట్లు విమర్శించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఐదు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, పార్టీ నగర కార్యదర్శి జి రమేష్, నగర నాయకులు ఎస్‌డీ హుస్సేన్, శ్రీరామ శ్రీనివాసులు, అత్తంటి శ్రీనివాసరావు, చాపల రమాదేవి, సీపీఐ జిల్లా నాయకులు ఆర్ వెంకటట్రావు, సీపీఐ నగర కార్యదర్శి ఎస్‌డీ సర్దార్, సహాయ కార్యదర్శి బి చంద్రశేఖర్, ఎన్ మోహనరావు, సీపీఐ జిల్లా నాయకులు కరవది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.