ప్రకాశం

వైకాపా జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 12 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న చర్చ ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జులకు రానున్న ఎన్నికల్లో ఎక్కువశాతం మంది టిక్కెట్లు దక్కుతాయా లేక వేరే వారికి అవకాశం కల్పిస్తారా అన్న మీమాంస ఆయా వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోయడం, అదేవిధంగా ఆర్థికంగా నష్టపోయినప్పటికి రానున్న ఎన్నికలే ధ్యేయంగా వైకాపా నాయకులు పనిచేశారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీలో కొత్తవారికి రాష్టప్రార్టీ అవకాశం కల్పిస్తోంది. అయితే ఆర్థికంగా నష్టపోయి, పార్టీ జెండాలను మోసిన నాయకులకు కాదని కొత్తవారికి టిక్కెట్లు కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటన్న చర్చ వైకాపా నేతల్లో మొదలైంది.
ఇదిలాఉండగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులుగా నియమించిన సమయంలోనే తమకే టిక్కెట్ దక్కుతుందన్న గంపెడాశలతో పార్టీ బలోపేతానికి పూనుకుంటారు. కానీ, తీరా కొత్తవారు తెరపైకి వస్తుండటంతో ఆయా వర్గాలకు చెందిన వారు డీలాపడిపోతున్నారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల మార్పు తథ్యంగా కనిపిస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు తెరపైకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయనేది జగమెరిగిన సత్యమే. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో సంవత్సరం కిందటే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా కృషి చేసి గెలుపొందారు. కాని రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం ఉన్న ఎక్కువశాతం మందికి టిక్కెట్లు దక్కుతాయో లేదో అన్న ఆందోళన వారిలో నెలకొంది. కాగా వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో పార్టీ బలోపేతమైందన్నది జగమెరిగిన సత్యమే. ఆ సమయంలోను వైకాపాకు చెందిన కొంతమంది ఇన్‌చార్జులు ఆర్ధికంగా ఖర్చు చేశారు. కాని వారిలోని కొంతమందికి టిక్కెట్లు దక్కుతాయో లేదో అన్న చర్చ వారిలో సాగుతోంది. రానున్న ఎన్నికలు వైకాపాకు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ప్రతి నియోజకవర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జిల్లాలో సర్వేలు జరిగాయి. ఈ సర్వేలలో పశ్చిమ ప్రకాశంలోని ఐదు నియోజకవర్గాల్లో వైకాపా, తూర్పుప్రకాశంలోని ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గాలి వీస్తుందని తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పశ్చిమప్రకాశంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి పశ్చిమ ప్రాంతంలోని నియోజకవర్గాలపై పట్టు సాధించాలని తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున ఇన్‌చార్జులుగా ఉన్న కొంతమందికి టిక్కెట్లు దక్కుతాయో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది. తీరా కష్టపడి పనిచేసిన తరువాత వేరేవారికి టిక్కెట్లు దక్కితే తమ పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా ఆ నేతల నుంచి వినిపిస్తోంది.