ప్రకాశం

జిల్లాలో పలుచోట్ల వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 15 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల భారీగానూ, మరికొన్ని చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో రైతాంగం ఖరీఫ్ సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ పాటికే కొంత మంది రైతులు తమ పొలాల్లో వివిధ పంటలను సాగు చేయగా మరికొన్ని ప్రాంతాల్లో పంటలు వేసేందుకు దుక్కులు దునే్న పనిలో నిమగ్నమైనారు. జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో సరాసరి వర్షపాతం 89.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 50.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఈ నెల 1వ తేదిన నాలుగు మిల్లీ మీటర్లు, 3వ తేదిన 14.2 , 4వ తేదిన 1.3 , 7వ తేదిన 5 మిల్లీ మీటర్లు, 8వ తేదిన 5.5, 10న 3.2 మిల్లీ మీటర్లు, 11న 2.6 , 12వ తేదిన 2.3, 13న 0.3, 14న 2.3, 15న 9.6 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో నెలసరి సగటు వర్షపాతం కంటే కేవలం 15 రోజులకే సగానికి పైగా వర్షపాతం నమోదు కావడంతో వాతావరణం చల్లబడటంతో పాటు అడుగంటి పోయిన నీరు భూముల్లో ఇంకే పరిస్థితికి చేరింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో జొన్న, మినుము, నువ్వు, కంది, పత్తి, సజ్జ వంటి పంటలను రైతులు కొంత మంది సాగు చేయగా మరికొంత మంది సాగుకు సిద్దం అవుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 9.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. జిల్లాలో అత్యధికంగా కొమరోలు మండలంలో 28.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అదే విధంగా మండలాల వారీగా వర్షపాత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కారంచేడులో 28, కంభంలో 27.6, గిద్దలూరులో 24.6, బేస్తవారిపేటలో 23.4, సంతమాగులూరులో 22.4, అర్థవీడులో 20.4, మార్కాపురంలో 18.4, సియస్ పురంలో 16.4, రాచర్ల లో 15.2, పొదిలిలో 14.8, చీరాల్లో 14.6, ఉలవపాడులో 14.2, యద్దనపూడిలో 12.6, తర్లుపాడులో 12.6, చిన్నగంజాంలో 11.8, నాగులుప్పలపాడులో 11.4, కందుకూరులో 11.2, కొనకనమిట్లలో 10.6, పర్చూరు, హనుమంతునిపాడు మండలాల్లో 10.2, మార్టూరులో 9.8, పొన్నలూరు 9.6, పిసిపల్లి 9.4,పెద్దారవీడులో 9, మద్దిపాడు, వెలిగండ్లలో 8.6, సింగరాయకొండ, కనిగిరి లో 8.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అదే విదంగా పామూరులో 7.8, జె పంగులూరులో 7.6, దోర్నాల లో 7.4, మర్రిపూడి, యర్రగొండపాలెంలో 7.2, ఇంకొల్లులో 7, వివి పాలెంలో 6.2, కొండేపిలో 5.8, వేటపాలెంలో 5.6, గుడ్లూరులో 5.2, చీమకుర్తిలో 5, బల్లికురవలో 4, సంతనూతలపాడులో 3.6, దొనకొండ లో 3.4, ఒంగోలు, జరుగుమల్లి మండలాల్లో 2.8, ముండ్లమూరు, త్రిపురాంతకం మండలాల్లో 2.6, కొరిశపాడు , తాళ్లూరు మండలాల్లో 2.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.