ప్రకాశం

ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జూలై 16: విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు కృషి చేసి విద్యార్థుల నుంచి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. వేటపాలెం మండలం కొత్తపేటలో నూతనంగా నిర్మించిన ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, ఆర్వోప్లాంటు, భోజనశాలను పరిశీలించారు. బోధనాసరళి పట్ల విద్యార్థుల స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి విఠపు మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు ఇక్కడకు రావడం హర్షణీయమన్నారు. శాసనమండలిలో ఈ పాఠశాల గురించి ప్రస్తావించి రాష్టవ్య్రాప్తంగా ఇదే తరహా పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కేరళ రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 40వేల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ఆ రాష్ట్రంలో ఒక్కో పాఠశాలకు అక్కడి ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించిందన్నారు. 98.2శాతం మంది పిల్లలు అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని తెలిపారు. చిత్తశుద్ధితో కృషి చేస్తే మన రాష్ట్రం లోనూ ఆధునిక వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు సాధ్యమన్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలలకు ప్రహరీగోడలు నిర్మించేందుకు చైర్మన్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. నూతన హంగులతో కొత్తపేట ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తీర్చిదిద్దారని కొనియాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా ఇజ్రాయేల్, యుటిఎఫ్ నాయకులు కె వీరాంజనేయులు, కుర్రా రామారావు, కుర్రా శ్రీనివాసరావు, షేక్ జానీ బాషా, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు గవిని నాగేశ్వరరావు, సత్యనారాయణ, మస్తాన్‌రావు, శంభుప్రసాదు, ఎస్‌జిడి ఖురేషి తదితరులు పాల్గొన్నారు.