ప్రకాశం

రామాయపట్నం సాధన కోసం వైకాపా నిరంతరం పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 16: రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాలోని రామాయపట్నం వద్ద పోర్టు ఏర్పాటుచేసే వరకు తమపార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని వైకాపా ముఖ్యనాయకుడు, ఒంగోలు పార్లమెంటు మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. సోమవారం స్ధానిక ఆచార్య ఎన్‌జి రంగాభవన్‌లో అసలు ప్రకాశం జిల్లాలో భారీ ఓడరేవు నిర్మిస్తారా లేదా, కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల వైఖరిపై చర్చా చర్చా గోష్టికార్యక్రమం జరిగింది. ఈ చర్చా గోష్టికార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మాజీ ఎంపి వైవి మాట్లాడుతూ అవకాశాలే లేని దుగరాజపట్నం పోర్టు కావాలని రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకోరటం దృష్టకరమన్నారు. వివాద స్ధలం అయిన ఓడరేవు చీరాలలో పోర్టు నిర్మిస్తాం స్ధలాన్ని కేటాయించమని కేంద్రమంత్రి నితిన్ గడ్కారి కోరటం విడ్డూరంగా ఉందన్నారు. సహాజ అనుకూలతను ఉన్న రామాయపట్నం పోర్టు గతి ఏమిటిని ఆయన ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు, కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆయన ధ్వజమెత్తారు. రామాయపట్నం వద్ద పోర్టు ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. రామాయపట్నంవద్ద పోర్టు ఏర్పాటుకు జాతీయరహదారి, రైల్వేలైను దగ్గరలో ఉందన్నారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుఅయితే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని ఆయన తెలిపారు. టెక్నికల్‌గా కూడా అనుకూలంగా ఉందని నివేదికలు ప్రభుత్వాలకు సమర్పించారని ఆయన పేర్కొన్నారు. జిల్లా అన్నిరంగాల్లోను వెనుకబడి ఉందన్నారు. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతుందని అందువలన పశ్చిమప్రాంత ప్రజలు తాగు,సాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ చర్చాగోష్టికార్యక్రమంలో మార్కాపురం, సంతనూతలపాడు శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, రంగారావు,చుంచు శేషయ్య తదితరులు పాల్గొన్నారు.