ప్రకాశం

ఒంగోలు డెయిరీ, డీసీసీ, డిసిఎంఎస్‌ను నిర్వీర్యం చేసిన దామచర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 16: తన హయాంలో ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ఎంతో జరిగిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
సోమవారం స్థానిక వైసిపి జిల్లాకార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1999 నుండి 2004 సంవత్సరం వరకు తాను ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నానని, ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో 30వేల రిలీఫ్‌ఫండ్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు. 2004సంవత్సరం నుండి 2010 సంవత్సరం వరకు తాను కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నానని ఆయన గుర్తుచేశారు. తన హయాంలో 220కోట్ల రూపాయలతో రిమ్స్ ఆసుపత్రి, మెడికల్ కాలేజిలను ఏర్పాటుచేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఉలిచి చెక్‌డ్యాంను పూర్తిచేశామన్నారు. 25కోట్లరూపాయలతో ఎనిమిది ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించినట్లు చెప్పారు. నగరంలోని కేశవరాజుగుంట, బాలినేని భరత్‌కాలనీ, మిలటరీ కాలనీ, కరుణకాలనీ, పులివెంకటరెడ్డి కాలనీ, ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ గృహాలతో పేదలందరికి ఎనిమిదివేల ఇంటిపట్టాలు, రెండువేల గృహాలను కట్టించి ఇచ్చినట్లు చెప్పారు. 16కోట్లరూపాయలతో పోతురాజుకాల్వ అభివృద్ధి చేసినట్లు చెప్పారు. శివారు కాలనీలను ఒంగోలు నగర అభివృద్ధి కోసం కార్పొరేషన్‌లో విలీనం చేసినట్లు చెప్పారు. ఒంగోలు నగరంలోని పేదలపై కోట్లాది రూపాయల పన్నులు వసూలు చేసి అభివృద్ధి పనులను ఏకపక్షంగా కమిషన్లు వసూలు చేసి పనులను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అప్పగించారని ఆయన ఆరోపించారు. మరుగుదొడ్లు కట్టిన వాటిని చూపించి జన్మభూమి కమిటీలు, డివిజన్ అధ్యక్షులు కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు, రుణాలను అర్హులకు కాకుండా కమిషన్లు తీసుకుని పచ్చచొక్కాల వారికే కేటాయించటం నిజంకాదా అని ఆయన ప్రశ్నించారు. ఒంగోలు డెయిరీని స్వయంగా దామచర్ల నాశనం చేశారని ఆయన ఆరోపించారు. డీసీసీబీని పనికిరాకుండాను, డిసిఎంఎస్‌ను దామచర్ల మూతవేయించారని ధ్వజమెత్తారు. తాను కొణిజేడును అభివృద్ధి చేయకపోతే దామచర్ల సొంతగ్రామమైన నాయుడుపాలెంను సింగపూర్ చేశావా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌పై మండిపడ్డారు. ఈ విలేఖర్ల సమావేశంలో వైకాపా ఒంగోలు నగర కమిటీ అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.