ప్రకాశం

మనుగడ కోసమే తల్లిపిల్ల కాంగ్రెస్‌ల ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,మే 6:రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో కేవలం పార్టీల మనుగడ కోసమే తల్లి,పిల్లకాంగ్రెస్‌లు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మంచౌదరి విమర్శించారు. శుక్రవారం స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండురోజులుగా డిల్లీలో, రాష్ట్రంలోజరుగుతున్న పరిణామాలపై డిపాజిట్‌కోల్పోయిన కాంగ్రెస్‌పార్టీ, అవినీతి పునాదులనుండి పుట్టిన వైకాపానేతలు రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులైన కాంగ్రెస్‌పార్టీనేతలు రఘవీరారెడ్డి, తులసీరెడ్డి, వైకాపానేతలు ధర్నాన ప్రసాదురావు, పార్థసారధి, బొత్స సత్యనారాయణలు ప్రత్యేకహోదాపై ఈనెల 10వతేదీన కలెక్టరేట్‌ల వద్ద ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వటం నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆనాడు వీరంతా కాంగ్రెస్‌పార్టీలో మంత్రులుగా ఉండి సమైక్యాంధ్ర ఉద్యమాలను పూర్తిగా అణిచివేయటమే కాకుండా రాష్టవ్రిభజనలో ప్రముఖ పాత్రపోషించిన ఈనేతలు ప్రత్యేకహోదాపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి డిల్లీ వెళ్లి ప్రధానిని ఒకమాట కూడా అనకుండా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. ఆనాడు రాష్టవ్రిభజన సమయంలో కాంగ్రెస్‌పార్టీ ప్రత్యేకహోదాపై చట్టం చేయలేదన్నారు. రాష్ట్ర ఆర్థికములాలు దెబ్బతీసిన జగన్‌కూడా ఎంపిగా ఉండి రాష్టవ్రిభజనకు సహకరించారన్నారు. కలెక్టరేట్ల వద్ద ధర్నాకార్యక్రమాలు జరిగితే రవాణా, సమాచార వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. తెలుగుదేశం,బిజెపిలు కలిసి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నారని ప్రత్యేకహోదాపై రాజకీయాలు చేయవద్దని హితవుపలికారు. విలేఖర్ల సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పమిడి భానుచందర్ పాల్గొన్నారు.