ప్రకాశం

‘స్వధార్‌గృహాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 17 : నిరాశయులు, నిర్భయులైన మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వధార్ గృహాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెండవ సంయుక్త కలెక్టర్ డి మార్కండేయులు పిలుపునిచ్చారు. మంగళవారం సంతనూతలపాడు మండలం ఎండ్లూరు డొంకలోని నందమూరి తారాక రామారావు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిక కేంద్రం, మహిళా ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్వధార్ గృహభవనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలు, బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో పేదరికం ఎక్కువగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయన్నారు. చీరాల, వేటపాలెం వంటి ప్రాంతాల్లో మహిళలు అనేక సమస్యలతో చాలా కష్టపడుతున్నారని ఆవేదన చెందారు. అన్యాయం, హింసకు గురైన మహిళలకు మనుగడ, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం స్వధార్ గృహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఇలాంటివి ఎన్‌జీవోలు నడిపేవారని, అవి సరైన నిర్వహణ , సౌకర్యాలు లేక మహిళలు ఇబ్బందులు పడేవారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళలకు ఆశ్రయం కల్పించి ఆదుకునేందుకు ప్రభుత్వమే చొరవ చూపి స్వధార్ గృహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో వారికి ఉచితంగా భోజనం, వసతి, న్యాయసహాయం, కౌన్సిలింగ్ సేవలు, వృత్తి శిక్షణ, వైద్య సహాయం అందిస్తారన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు సురక్షితంగా ఉండవచ్చునని, మంచి వాతావరణం ఉన్నందున ఆరోగ్యంగా ఆనందంగా ఉండవచ్చునన్నారు. మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాంతీయ సంచాలకులు వి శారద మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిది స్వధార్ గృహాలు మంజూరు కాగా అందులో ఒకటి ఒంగోలులో ఏర్పాటు చేశామన్నారు. మహిళా ప్రాంగణంలో ఒక భవనాన్ని ఆధునీకరించి స్వధార్ గృహం కోసం సిద్ధం చేసినట్లు చెప్పారు. సమాజంలో కొంత భద్రత తక్కువగా ఉందన్నారు. అనాధలైన కుటుంబాలకు శారీరకంగా, మానసికంగా హింసకు గురైన మహిళలకు ఒక స్టాప్ సెంటర్ ద్వారా ఐదు రోజులు కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత స్వధార్ గృహంలో చేర్చడం జరుగుతుందన్నారు. న్యాయపరమైన సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మహిళలతో పాటు యుక్తవయస్సులో ఉన్న బాలికలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధికి తోడ్పడుతామన్నారు. స్వధార్ గృహంలో క్రమశిక్షణ, స్నేహభావంతో మెలగాలన్నారు. ఐసిడిఎస్ పీడీ సరోజిని మాట్లాడుతూ ఎలాంటి ఆర్థిక, సామాజిక సహకారం లేని మహిళలకు స్వధార్ గృహం ఆశ్రయం కల్పిస్తుందన్నారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ సుధ మాట్లాడుతూ నిరాదరణకు గురైన మహిళలు, గృహహింస బాధితులు, అక్రమ రవాణా కు గురైన స్ర్తిలు, బాలికలు, దోపిడీకి గురి అవుతున్న వారు, కుటుంబంలో అసమ్మతికి, ఉద్రేకానికి గురై ఇంటి నుండి బయటకు వచ్చిన వారు, ఎలాంటి జీవనాధారం లేని వారికి స్వధార్ గృహంలో ఆశ్రయం కల్పిస్తారన్నారు. అనంతరం మహిళా ప్రాంగణంలో మార్కండేయులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం మహిళలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.