ప్రకాశం

కావాలనే పంచాయితీ ఎన్నికలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 19: గ్రామపంచాయతీలలో జన్మభూమి కమిటీలు , సాధికార మిత్రలు , కార్యకర్తలతో బినామీపాలన కొనసాగించేందుకే ప్రభుత్వం కావాలనే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసిందని జిల్లా సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జి వీరభద్రాచారి ఆరోపించారు. గురువారం సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీతో గడువు ముగుస్తున్నా పంచాయతీ పాలక వర్గాలకు ఎన్నికలు ప్రక్రియలో ఎలాంటి చర్యలు చేపట్టనందున, పంచాయతీలలో ప్రత్యేక అధికారులను నియమించి కార్యకర్తల ద్వారా పాలన కొనసాగించాలన్న ప్రభుత్వ యోచనను గమనించామన్నారు. ఇప్పటి వరకు అనేక జిల్లాల సర్పంచ్‌ల సంఘాలు కలసి విన్నవించినా, అనేక అర్జీలు సమర్పించినా స్పందించని ప్రభుత్వ తీరు పై గత్యంతరం లేకనే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంను సర్పంచ్‌లు ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. గత 12 నెలలుగా ఎలాంటి బిల్లులు ట్రెజరీ ఆంక్షలు పేరుతో మార్చి వరకు , మార్చి నుండి సిఎఫ్‌ఎంఎస్ పేరుతో నేటి వరకు కోట్లు రూపాయలుకు అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లను కొనసాగించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సొంత నిధులు వినియోగించి రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ముఖ్యంగా ఉపాధి హామీ పనులుకు రాష్ట్రం కేంద్రం నుండి అవార్డు పొందడానికి సర్పంచ్‌లే కారణమన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీ రాజ్ శాఖామంత్రి లోకేష్ గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా తక్షణమే ఎన్నికలను అయినా నిర్వహించాలి లేదా పర్సన్ ఇన్‌చార్జీలుగా 2వేల సంవత్సరంలో ఇదే ముఖ్యమంత్రి కొనసాగించిన విధంగా కొనసాగించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులను కొనసాగించడం తగదని వీరభద్రాచారి ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నత న్యాయస్థానంలో వేసిన కేసు ఈనెల 25కు వాయిదా వేసి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారని ఆయన తెలిపారు.