ప్రకాశం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూలై 20: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించి విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ వైఖరికి నిరసనగా పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీని చేపట్టారు. స్థానిక చర్చి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన జరిపి చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో చేసిన వాగ్ధానాన్ని, విభజన చట్టంలో పొందుపరచిన ప్రతి అంశాన్ని అమలుచేసి రాష్ట్భావృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేసారు. రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా రాష్ట్రప్రజలకు వాగ్ధానం చేసిన మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తుంగలోకి తొక్కి రాష్ట్రప్రజలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. రాజధాని శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ పిడికెడు మట్టి- చెంబుడు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో రాష్ట్రానికి అన్ని హామీలు నెరవేర్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు దేశ ప్రధాని తీవ్ర ద్రోహం చేశారని విమర్శించారు. ఐదుకోట్ల ఆంధ్రుల ప్రజల అభిమాతాన్ని గుర్తించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో యుపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెబుతూ, అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ తన మొదటి సంతకాన్ని రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై చేస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, అధికార ప్రతినిధి యాదాల రాజశేఖర్, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు వేమా శ్రీనివాసరావు, జి.రాజ్‌విమల్, పీసీసీ కార్యదర్శి గాదె లక్ష్మారెడ్డి, నాయకులు పైడి యుగంధర్, సుబ్బారావు, శ్రీను, హరిబాబు, కోటేశ్వరరావు, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.