క్రైమ్/లీగల్

వీడు మాయగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, జూలై 23: ఏకంగా 7.40కోట్ల రూపాయల విలువైన సెల్‌ఫోన్లను మాయం చేసి, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకుని హాయిగా జీవిద్దామనుకున్న మాయగాడు కటకటాలపాలయ్యాడు. సెల్‌ఫోన్ల దొంగను పోలీసులు అరెస్టు చేసి సోమవారం మధ్యాహ్నం అద్దంకి సర్కిల్ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో దర్శి డివిజన్ డిఎస్‌పి కె నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 19వ తేదిన ఉదయం కొరిశపాడు మండలం మేదరమెట్ల పోలీస్‌స్టేషన్‌లో సెల్‌ఫోన్‌లతో కూడిన లారీని గుర్తుతెలియని వ్యక్తులు దొంగింలించారని లారీ డ్రైవర్, ఓనర్ అయిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వెంటనే అద్దంకి సర్కిల్ పరిధిలో గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఎట్టకేలకు మేదరమెట్ల శివారులోని సుబాబుల్‌తోటలో దాచి ఉంచిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సెల్‌ఫోన్ లారీ డ్రైవరు,ఓనర్ అయిన కొడగంటి రంగనాధన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. కాగా రెడ్‌మీ ఫోన్లను చిత్తూరు నుండి కలకత్తాలోని హుగ్లాకు గత ఆరు సంవత్సరాలుగా తన లారీలోనే రవాణా చేస్తూ కంపెనీకి నమ్మకంగా పనిచేస్తున్నాడు. రంగనాధన్‌కు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో ఆర్ధిక సమస్యలు తొలగించుకునేందుకు, సెల్‌ఫోన్‌లతో కూడిన లారీని మాయం చేసి, తన సొంత లారీకి కూడా ఇన్సూరెన్స్ పొందవచ్చునన్న ఆలోచన చేశాడు. 19వ తేది ఉదయం తాను అనుకున్న పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమై మేదరమెట్ల శివారులోని సుబాబుల్‌తోటలో లారీని దాచాడు. లారీ కనిపించడం లేదంటూ మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిబ్బందిచేత లారీని వెదికిస్తూ, ఫిర్యాదుదారునిపై అనుమానమొచ్చిన పోలీసులు తమదైన రీతిలో రంగనాధన్ నుండి నిజం రాబట్టారు. తనసొంత అవసరాల కోసమే తాను లారీని మాయం చేశానని ఒప్పుకొన్నాడని, నిందితుడుని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామని డిఎస్‌పి తెలిపారు. ఈ సమావేశంలో అద్దంకి సీఐ హైమారావు, మేదరమెట్ల ఎస్సై పాండురంగారావు, హెడ్‌కానిస్టేబుల్ మలాది కోటేశ్వరరావుకు డిఎస్‌పి స్పెషల్ రివార్డులు అందచేశారు.