ప్రకాశం

జిల్లాలో తాగునీటి అవసరాల కోసం నాలుగు టిఎంసిల సాగర్ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 13:జిల్లాలో తాగునీటి అవసరాల కోసం నాలుగు టిఎంసిల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ వి వినయ్‌చంద్ తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సాగర్ జలాలు చెరువులకు నింపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జలవనరులశాఖ, గ్రామీణ నీటిసరఫరా శాఖ, రెవిన్యూశాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి అవసరాల కోసం సాగర్ కాల్వ ద్వారా ఈనెల 15వతేదీ నుండి 25వతేదీ వరకు చెరువుల్లో నీటిని నింపుకునేందుకు ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో తాగునీటి రక్షిత పథకాల్లో కేవలం పదిశాతం మాత్రమే నీటి నిల్వ ఉందన్నారు. 85/3మైలు వద్ద 2800క్యూసెక్కుల నీటిప్రవాహం తగ్గకుండా చర్యలు తీసుకోవాలనికలెక్టర్ ఆదేశించారు. రామతీర్ధం జలాశాయానికి 1.5టిఎంసిల నీటిని మొదటి ప్రాధాన్యత ఇచ్చి నింపాలన్నారు. పమిడిపాడు బ్రాంచ్‌కెనాల్‌కు ఈనెల 17వతేదీనుండి 9రోజులపాటు ఆరువందల క్యూసెక్కుల నీటిని సరఫరాచేయాలన్నారు. మోదేపల్లి మేజర్‌కు ఈనెల 18వతేదీనుండి మూడువందల క్యూసెక్కుల నీటిని విడుదలచేయాలని, రజానగరం మేజర్‌కాల్వకు వందక్యూసెక్కుల నీటిని విడుదలచేయాలన్నారు. 18/0వద్ద వెయ్యిక్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రామతీర్ధం జలాశాయాన్ని పూర్తిగా నింపిన తరువాత ఒంగోలు సమ్మర్‌స్టోరేజి ట్యాంకులకు నీటిని విడుదల చేయాలన్నారు. జిల్లాలోని తాగునీటి చెరువులను సాగర్‌నీటితో నింపాలన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ఎస్‌ఇ రవి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఇ సంజీవరెడ్డి, జిల్లా రెవిన్యూఅధికారి వెంకటసుబ్బయ్య, ఒంగోలు, కందుకూరు ఆర్‌డిఒలు శ్రీనివాసరావు, మల్లికార్జున్, జలవనరుల శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.