ప్రకాశం

జిల్లాలో కాంగ్రెస్ బలపడేనా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 13: రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ ఎంతబలం పుంజుకుంటే అంత నష్టం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీకి సంప్రదాయబద్ధంగా రెడ్డి, ఎస్‌సి,ముస్లిం, మైనార్టీ వర్గాలు గతంలో ఉండేవి. కాని ఆ వర్గాల్లోని ఎక్కువశాతం మంది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీకి మద్దతు పలుకుతున్నారనేది జగమేరిగిన సత్యమే. రాష్టమ్రుఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని స్థాపించిన తరువాత కాంగ్రెస్‌పార్టీకి చెందిన సంప్రదాయ ఓటర్లు అందరూ వైకాపా గూటికి చేరిపోయారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా కేంద్రంలోని కాంగ్రెస్‌ప్రభుత్వం విడగొట్టడటంతో కూడా ప్రజలు ఆ పార్టీని అసహ్యయించుకుని గతంలో జరిగిన ఎన్నికల్లో తగిన గుణపాఠాన్ని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేసేందుకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి నూతన పీసీసీ రథసారధిగా ఊమెన్‌చాందీని ఎఐసిసి నియమించింది. దీంతో ఆయన రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూనే జిల్లాలో కూడా పర్యటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు ఊమెన్‌చాందీ ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్‌పార్టీని విడిపోయిన వారందరూ తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తొలుతగా ఉమ్మడి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌పార్టీలోకి చేర్చుకుని ఊమెన్‌చాందీ సఫలీకృతులయ్యారు. అందులో భాగంగా ఇతర పార్టీల్లో రాజకీయంగా స్తబ్ధతగా ఉన్న ముఖ్యమైన నేతలకు గాలం వేసేందుకు కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనాయకులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పనిచేసిన సమయంలో జిల్లాలోని కొంతమంది ముఖ్యమైన నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆసంబంధాలకు నల్లారి పదునుపెట్టి కొంతమందినైనా పార్టీలోకి తీసుకువెళ్తారా అన్నచర్చ జిల్లావ్యాప్తంగా సాగుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి సైతం జిల్లాలో పర్యటించి వెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ ఒంగోలు నియోజకవర్గ విస్తత్రస్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, పీసీసీ నాయకులు ఎన్ తులసీరెడ్డితోపాటు పలువురు ముఖ్యనాయకులు హాజరయ్యారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని గెలిపించాలని వారు పార్టీశ్రేణులకు విజ్ఞప్తిచేస్తున్నారు.
కాగా గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఏర్పాటుచేయకముందు ఉమ్మడి రాష్ట్రంలోనుకాని, జిల్లాలో కాని కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల మధ్యనే తీవ్రమైన పోటీ ఉండేది. మారిన రాజకీయపరిస్థితుల నేపధ్యంలో కాంగ్రెస్‌పార్టీకి ప్రస్తుతం అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీచేసేందుకు మాత్రం నాయకులు పరుగులు తీస్తున్నారు. ముందుగా తమపార్టీకి సంప్రదాయబద్ధంగా ఉన్న రెడ్డి, ముస్లిం, ఎస్‌సి, మైనార్టీవర్గాలను తమవైపు తిప్పుకునేలా కాంగ్రెస్‌పార్టీ పావులు కదుపుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అదే జరిగితే మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.
గతంలో జరిగిన 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలుగుదేశంపార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపధ్యంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న మెజార్టీ కాపువర్గం తెలుగుదేశంపార్టీకి మద్దతు ప్రకటించటంతో అధికారంలోకి తెలుగుదేశంపార్టీ వచ్చింది. ప్రస్తుతం జనసేనాని ఒంటరిగా పోటీచేయనున్న నేపధ్యంలో ఆప్రభావం తెలుగుదేశంపార్టీపై పెనుప్రభావం చూపే అవకాశాలున్నాయి. మొత్తంమీద జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ పుంజుకుంటే మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి మాత్రం నష్టం వాటిల్లుతుందని రాజకీయవిశే్లషకులు భావిస్తున్నారు.