ప్రకాశం

2019 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, ఆగస్టు 13: రానున్న 2019 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మీ జోస్యం చెప్పారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో దుష్టపరిపాలన కొనసాగుతుందన్నారు. నాలుగు సంవత్సరాల ఎన్‌డియే, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో అన్నివర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పత్రికా స్వేచ్ఛను, వాట్సప్, ఫేస్‌బుక్ స్వేచ్ఛలను కూడా దేశ ప్రధాని నరేంద్రమోదీ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్పొరేటర్లకు పెద్దపీఠ వేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి విభజన చేసి రాష్ట్రానికి రావాల్సిన అన్నీ అంశాలను విభజనచట్టంలో పొందుపరిస్తే ఎన్‌డియే ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడిచిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన చట్టాన్ని అమలు చేస్తామన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయిన వెంటనే మొదటి సంతకం రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై చేస్తారన్నారు. ఇప్పటికే ఈ అంశాలపై సిడబ్ల్యూయుసి సమావేశాల్లో తీర్మానించినట్లు చెప్పారు. గతంలో 70 వేల కోట్లరూపాయల పైచిలుకు రుణమాఫీ చేశామని, తిరిగి రైతులకు మళ్లీ రుణమాఫీ చేస్తామన్నారు. దేశంలో ప్రజాపాలన కొనసాగడం లేదని, హిట్లర్ పాలన సాగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో నెల్లూరు జిల్లాలోని రాపూరులో పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పర్యటిస్తారన్నారు. ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ తులసీరెడ్డి మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సతీమణి భారతి విషయంలో చట్టం తనపని తాను చేస్తుందని, చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందన్నారు. నవంబర్ 19వ తేది వరకు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి వెళ్లి ఒక రూపాయి చందా తీసుకుంటున్నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాల కాలంలో దేశంలో రాక్షస పాలన కొనసాగిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, వైకాపా పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. నోట్ల రద్దు, జిఎస్‌టి, సంక్షోభంలో వ్యవసాయ రంగం, నిరుద్యోగ సమస్య, జాతీయస్థూల ఉత్పత్తి రేట్లు తగ్గిపోవడం, జిడిపి గ్రోత్ రేటు పడిపోయాయన్నారు. యుపిఏ హయాంలో అన్నీ రంగాలు ముందుకెళితే ఎన్‌డియే హయంలో అన్నీ రంగాలు నిర్వీర్యం అయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. 1958వ సంవత్సరం నుండి 2014 వరకు 16 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే లక్ష కోట్లరూపాయల అప్పు మాత్రమే ఉండగా చంద్రబాబు నాలుగు సంవత్సరాల పరిపాలనలో లక్షా 49 వేల 435 కోట్ల రూపాయలు అప్పు తేలిందన్నారు. రాష్ట్రంలో జగన్ పార్టీకి 67 మంది శాసన సభ్యులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా కాని అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ప్రజల సమస్యలను వినిపించకుండా బాయ్‌కాట్ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. త్వరలో వైకాపాను ప్రజలే బహిష్కరిస్తారన్నారు. వైకాపా పార్టీ అట్టర్ ప్లాప్‌గా తయారు అయ్యిందని, కబ్జా, నకిలీ పార్టీగా అవతరించిందన్నారు. రాష్ట్రానికి బీజేపీ, టీడీపీ, వైకాపా పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. ప్రజలను చైతన్యం చేసి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పటి నుండే గ్రామస్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు అన్నీ కమిటీలను పూర్తి చేస్తున్నామన్నారు. ఇంటింటికి కాంగ్రెస్, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, అసెంబ్లీ, మండల కేంద్రాల వారీగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. పార్టీకి దూరంగా ఉన్న వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చేవూరి దేవకుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లింగంశెట్టి ఈశ్వర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి మిరియాల రత్నకుమారి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కె వినయ్‌కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్‌రెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు శ్రీపతి ప్రక్శం లతో పాటు నియోజక వర్గాల ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.