ప్రకాశం

2019 సంక్రాంతి పండుగకు నీరు ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, ఆగస్టు 14: 2019 సంక్రాంతి పండుగకు సాగు, తాగునీరుని అందిస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. ప్రకాశంజిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరుగ్రామం వద్ద పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి, రెండవ టనె్నల్ పనులు సుమారు 6నెలల నుంచి ఆగిపోయాయి. ఈ పనులను పరిశీలించి రాష్ట్ర పర్యావరణ శాస్త్ర సాంకేతికశాఖమంత్రి శిద్దా రాఘవరావు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ, ఎంఎల్‌సిలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బాలరామకృష్ణమూర్తి, జిల్లాకలెక్టర్ వినయ్‌చంద్, స్పెషల్ కలెక్టర్ వేమా సుందర్ వెంకటరావు, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు, మార్కాపురం మాజీఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలు మంగళవారం పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగ పనులను సందర్శించి పరిశీలించారు. మొదటి సొరంగంలో మూడు కిలోమీటర్లు వెళ్లి అక్కడ నిచిలిపోయిన పనులను, టిబిఎం మిషన్‌ను పరిశీలించారు. రెండవ సొరంగంలో యంత్రాల గురించి ప్రాజెక్టు ఇంజనీర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ విజయవాడలో నీటిపారుదలశాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాత, కొత్త ఏజెన్సీల ప్రతినిధులతో, ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ఏవిధంగా శ్రద్ధ తీసుకుంటున్నారో పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుపై కూడా అంతకన్న ఎక్కువశ్రద్ధ చూపుతున్నారని అన్నారు. ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు ప్రతినెల ఒకసారి సందర్శిస్తారన్నారు. అయితే నాలుగురోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనె్నల్ పనులను ప్రారంభించి పనులను శరవేగంగా జరుపుతారని అన్నారు. మొదటి సొరంగం 18.80 కిలోమీరట్లకు గానూ 3.6 కిలోమీటర్లు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులను సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. రెండవ టనె్నల్ పనులు 8కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది, పూర్తి చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని అన్నారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఇ రెడ్డయ్య, ఇఇ అబుతాలిన్, ఎంపీపీ వేదాంత ప్రభాకర్, మండల టీడీపీ నాయకులు అంబటి వీరారెడ్డి, కాసా రఘునాథరెడ్డి, భట్టు సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
* ప్రాజెక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తా - శిద్దా
వెలుగొండ ప్రాజెక్టులో పనులు చేస్తున్న సుమారు 400మంది కార్మికులకు 5నెలల జీతాలు, ఏడాదిన్నర పిఎఫ్ ఇవ్వకపోవడంతో కార్మికులు మంత్రి శిద్దా రాఘవరావుకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి శిద్దా మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించి వెంటనే జీతాలు, పిఎఫ్ అందజేస్తామని తెలిపారు.