ప్రకాశం

ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించడం హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 14 : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ అప్పటి యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేకహోదా హామీతోపాటు, రాష్టవ్రిభజనలోని అన్నిఅంశాలను అమలుచేస్తామని హామీ ఇవ్వటం పట్ల రాష్టక్రాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక జిల్లాకాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన సభలో 30వేలమంది ప్రజల మధ్యన ఎపికి ప్రత్యేకహోదా హామీ ఇస్తామని ప్రకటించటం సంతోషకరమైన విషయమన్నారు. ఒకపక్క టిఆర్‌ఎస్ పార్టీ ఎపికి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణా వెనుకబడుతుందని అంటున్న నేపధ్యంలో తెలంగాణా నడిగడ్డపై జరిగిన సభలో రాహుల్‌గాంధీ ఎపికి ప్రత్యేకహోదాతోపాటు రాష్టవ్రిభజనలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలుచేస్తామని ప్రకటించటం ఎపిలోని ఐదుకోట్ల మంది ప్రజలు సంతోషించాల్సిన విషయమన్నారు. సిడబ్ల్యుసిలో తీర్మానం ఈ అంశాలపై చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా హామీలను అమలుచేయనున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ 175స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు హస్తం గుర్తుపై పోటీచేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయంలో కాంగ్రెస్‌పార్టీ కీలకపాత్రపోషించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ, వైకాపాల్లో అవినీతి మేఘాలు కమ్ముకున్నాయని, ఎన్నికల సమయానికి వారు అవి చేధించుకోవటం కష్టమేనని పేర్కొన్నారు. 2019లో దేశంలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ రెండువందల పార్లమెంటు స్థానాలను గెలుచుకోవటం ఖాయమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, అదేవిధంగా రాహుల్‌గాంధీ దేశప్రధాని కూడా అవుతారని ధీమాను వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీని దేశప్రధానిగా చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్‌షామీద, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిమీద అవినీతి ఛాయలు ఉన్నాయని వాటన్నింటిని క్లియర్‌చేసుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆయన అన్నారు. గతంలో గుంటూరులో జరిగిన సభలోను కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీలోను సిడబ్ల్యుసి సమావేశాల్లోను పార్లమెంటు సమావేశాల్లో కూడా తాము అధికారంలోకి వస్తే రాష్ట్భ్రావృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవటంతోపాటు ప్రత్యేకహోదా, విభజన హామీలను నెరవేరుస్తామని కూడా రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్‌పార్టీ హస్తం గుర్తుపై రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి కాంగ్రెస్‌పార్టీని కేంద్రంలోను,రాష్ట్రంలోను గెలిపించాలని ఆయన కోరారు. ఈ విలేఖర్ల సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, కాంగ్రెస్‌పార్టీ నాయకులు గాదె లక్ష్మారెడ్డి, గుర్రాల రాజ్‌విమల్, వేమా శ్రీనివాసరావు, డి చంద్రశేఖర్, పి వెంకటేశ్వర్లు, సీతారామాంజనేయులు, యాదాల రాజశేఖర్, ఎస్‌కె రసూల్, ఆదినారాయణరెడ్డి, బుజ్జి, కోటిరెడ్డి, డి వెంకటేశ్వర్లు, యాకోబు, ఎస్ సతీష్, కొప్పొలు సుబ్బారావు, దావీదు తదితరులు పాల్గొన్నారు.