ప్రకాశం

అందరి దృష్టి వెలిగొండపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 14:జిల్లాలోని అన్ని రాజకీయపక్షాలు పశ్చిమప్రాంతంలోని వెలిగొండ ప్రాజెక్టుపైనే దృష్టి సారించాయి. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ,పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అధికారపక్షంతోపాటు, ప్రతిపక్షం, వామపక్షాల పార్టీల నాయకులందరు వెలిగొండ ప్రాజెక్టును ప్రధానాస్త్రంగా మలుచుకుని ముందుకు దూసుకుపోతున్నారు. వచ్చేసంక్రాంతి నాటికి మొదటి టనె్నల్ ద్వారా నీటిని రైతాంగానికి విడుదల చేస్తామని రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఒంగోలులో జరిగిన ఆత్మగౌరవ దీక్ష, కనిగిరిలోని దూబగుంట బహిరంగసభల్లో ముఖ్యమంత్రి పదేపదే ఈవిషయాన్ని జిల్లాప్రజలకు గుర్తుచేశారు. దీంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందులోభాగంగానే మంగళవారం రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పి నారాయణ, శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరాం, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్‌రాజు, కదిరి బాబురావుతోపాటు జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్‌లు వెలిగొండ ప్రాజెక్టు టనె్నల్ పనులను పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి సంక్రాంతి నాటికి నీరు అందిస్తామని తెలుగుతమ్ముళ్లు ప్రకటించారు. ఈనేపధ్యంలో పశ్చిమప్రాంతంలో బలహీనంగా తెలుగుదేశంపార్టీని బలోపేతం చేసేందుకు వెలిగొండప్రాజెక్టును బ్రహ్మాస్త్రంగా మలుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన శాసనసభ్యులు గెలుపొందటం జరిగింది. ఈనేపధ్యంలో పదేపదే ముఖ్యమంత్రి పశ్చిమప్రాంతంలో తమకు ఓట్లు వేయకపోయినా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించటం జరిగింది. దీంతో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టనె్నల్ ద్వారా నీటిని విడుదలచేసి ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి ఇప్పటినుండే సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికి జిల్లాలోని పశ్చిమప్రాంతానికి యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో వైసిపికే ఎక్కువ బలం ఉందనేది ఇంటెలిజెన్సీ అధికారులు ఇచ్చిన నివేదికను బట్టి తెలుస్తొంది. ఈనేపధ్యంలో వెలుగొండ ప్రాజెక్టుద్వారా నీటిని విడుదలచేస్తే మాత్రం ఆ నియోజకవర్గాల్లో మార్పు జరుగుతుందో లేదో అనేది వేచి చూడాల్సి ఉంది.
కాగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఈ మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోను ఈ మూడు నియోజకవర్గాల్లోను భారీగా వైసిపికి ఓట్లు వచ్చాయి. దీంతో ఒంగోలు పార్లమెంటు సభ్యునిగా వైవి సుబ్బారెడ్డి గెలుపొందటం జరిగింది. మొత్తంమీద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో జిల్లాలోని పశ్చిమప్రాంతంలో పూర్తిస్థాయిలో పాగా వేయాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం.
కాగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ అంశంపై న్ని ఒంగోలు మాజీ పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక దృష్టిసారించి బుధవారం నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు అధిక నిధులను మంజూరు చేసింది దివంగత రాష్టమ్రుఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిఅని రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగుసంవత్సరాలు పూర్తవుతున్న ఇంతవరకు ప్రాజెక్టు పనులను పూర్తిచేయలేదని వైవి ధ్వజమెత్తుతున్నారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ వైవి పాదయాత్రను కనిగిరి నుండి ప్రారంభించనున్నారు. అదేవిధంగా వామపక్షాల నేతలు కూడా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనబాట పడుతున్నారు. మొత్తంమీద అన్ని రాజకీయ పక్షాల దృష్టి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణపై పడిందనే చెప్పవచ్చు.