ప్రకాశం

ప్రజాసమస్యలపై సీపీఎం పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,ఆగస్టు 17:ఒంగోలు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై సీపీఎం నేతలు పోరుబాట పాదయాత్రను ప్రారంభించారు. శుక్రవారం ఒంగోలులో ప్రారంభమైన ఈ యాత్ర స్థానిక 60 అడుగుల రోడ్డులో సీపీఎం రాష్టక్రార్యదర్శివర్గసభ్యులు సిహెచ్ బాబురావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని నగరాలకు, పట్టణాలకు అవార్డులు వస్తున్నాయన్నారు. మన ప్రగతి బాగా ఉందని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. కాని వర్షాలు వస్తే కాల్వల్లోని మురుగుమాత్రం రోడ్లపైనే ఉంటుందన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో నిధులు దుర్వినియోగం తప్ప ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు. నగరాల్లో ప్రభుత్వ సేవలు, పౌరసేవలను ప్రవేటీకరణ చేసి ప్రజలపై భారాలు తప్ప అందమైన నగరాలు ఏర్పడటం లేదన్నారు. నగరాల్లో అందరికి ఇళ్ల పథకం కింద ఐదులక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పారని, కాని పూర్తి అయినవి 33 వేల ఇళ్లు మాత్రమేనని తెలిపారు. రెండుశాతం ఇళ్ళు పూర్తి అయినట్లు లెక్కలు చెబుతున్నాయని, ఇంటిపన్నులు, నీటి పన్నులు పెంచుతున్నారన్నారు. ఒంగోలు నగరానికి ఏడుసంవత్సరాలు అయినా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. స్థానిక ప్రభుత్వాలు ఉంటే అధికార పార్టీ పెత్తనం ఉండదని, రాష్ట్రంలోని 25 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదని, వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లాకార్యదర్శి వర్గసభ్యులు జివి కొండారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరం అభివృద్దికి నిధులు తెచ్చి గొప్పగా అభివృద్ధి చేశామని, ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చామని తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నాయని, కాని నగరంలో ఎండాకాలం పగలు దోమలు కుడుతున్న మందు చల్లినా పాపాన పోలేదన్నారు. వర్షాలు వస్తే కాల్వల్లో మురుగునీరు, రోడ్లపైకి వస్తుందన్నారు. అందరికి ఇళ్ల పథకం కింద ఇళ్లను కేటాయించలేదని, పోతురాజుకాల్వ ఆధునీకరణ పనులు చేపట్టలేదని, ఒంగోలుకు రోజు మంచినీరు ఇస్తామని ఇంతవరకు గుండ్లకమ్మ మంచినీటి పథకాన్ని పూర్తిచేయలేదన్నారు. నగరకార్యదర్శి జి రమేష్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర శుక్రవారం తొమ్మిది డివిజన్లల్లో పర్యటించినట్లు చెప్పారు. పాదయాత్రలో ప్రజలు ఎన్నో సమస్యలను తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దామా శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, కంకణాల రమాదేవి, ఎస్‌డి హుస్సేన్, ఎ శ్రీనివాసులు, సిహెచ్ రమాదేవి, కెఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు.