ప్రకాశం

45 సంవత్సరాల్లో జిల్లాలో అభివృద్ధి శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, ఆగస్టు 17: పాలకుల అశ్రద్ధ కారణంగానే ప్రకాశం జిల్లా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందని, జిల్లా ఏర్పాటులోనే దురుద్దేశం దాగి ఉందని, షాడో ఏజెన్సీ ప్రాంతాన్ని ఒకటిగా చేసి జిల్లా ఏర్పాటు చేశారని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అమ్మవారిశాల బజారులో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1970లో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారని, జిల్లా ఏర్పడి 48 సంవత్సరాలు గడచినా ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదన్నారు. నాటి నుంచి నేటి వరకు జిల్లాప్రజలు తాగునీరు, విద్యావనరులను అడుగుతున్నారని, ఆ రెండింటినీ సమకూర్చడంలో పాలకులు తీవ్రంగా విఫలమయ్యారని పేర్కొన్నారు. 27 సంవత్సరాల కిందట 1991లో వెలుగొండ ప్రాజెక్టు జీవో విడుదలైందని, నేటికీ ఆ ప్రాజెక్టు పూర్తికాక కాంట్రాక్టర్ల కొండగా మిగిలిపోయిందని అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు అందుతుందని ప్రజలు ఆశపడ్డారని, ప్రాజెక్టును పూర్తిచేసే విషయంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆశలు సన్నగిల్లుతున్నాయన్నారు. 1996 వెలుగొండ ప్రాజెక్టు జీవోలో పొందుపరిచిన అంశాలు మెరుగైనవిగా ఉండగా, రోజులు గడుస్తున్నకొద్దీ ఆ అంశాల్లో తేడాలు చోటుచేసుకొని వ్యయం పెరుగుతూ వస్తోందని, ఏ ఒక్క టనె్నల్ కూడా పూర్తిచేయకపోవడం ఇందుకు నిదర్శనం అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో 3.12 కిలోమీటర్లు తవ్వారని, అంటే రోజుకు రెండు మీటర్లు మాత్రమే పనిచేశారని తెలిపారు. రోజుకు 15మీటర్లు తవ్వే జర్మనీ యంత్రం ఉండగా, కేవలం 2మీటర్లు మాత్రమే తవ్వడం వెనుక మతలబు ఏమిటని అన్నారు. తాను మర మనిషినని, సాంకేతికత తనకు తెలుసునని, రాష్ట్రంలో ఏ మూలలో ఏమి జరుగుతుందో అంతా తనకు తెలిసిపోతుందని పదేపదే చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెలుగొండ ప్రాజెక్టులో ఏమి జరుగుతుందో తెలియదా అని ప్రశ్నించారు. వెలుగొండ ప్రాజెక్టు టనె్నల్ వద్ద 300మంది కార్మికులు పనిచేస్తున్నారని, 8నెలలుగా వారికి జీతభత్యాలు లేవని, త్వరలో చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీపత్రం గడువుకూడా ముగిసిందని, ముందుగా అర్థాకలితో అలమటిస్తున్న కార్మికులకు జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వెనుక చంద్రబాబు స్వార్థం దాగి ఉందని, తల్లడిల్లే ప్రాంతాలకు అవసరమయ్యే ప్రాజెక్టులను పక్కకునెట్టి స్వార్థపూరితంగానే పోలవరానికి నిధులు ఖర్చు చేస్తున్నారని అన్నారు. మోసపూరిత ప్రకటనలు, పర్యటనలు, సందర్శనలు ఆపి అధిక నిధులు మంజూరుచేసి త్వరితగతిన వెలుగొండను పూర్తిచేయాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన త్యాగధనులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ఈకారణంగా నిర్వాసితులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించిన విధంగానే వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. వంశధార నిర్వాసితుల్లా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఉద్యమం నిర్వహించినప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని అన్నారు. ఇప్పటివరకు వెలుగొండ సాధన కోసం ధర్నాలు, పాదయాద్రలు లాంటి ఆందోళనలు చేశామని, రానున్న రోజుల్లో సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యాచరణ పాలకుల దిమ్మతిరిగేలా ఉంటుందని అన్నారు. ఈ సభకు సీపీఎం మార్కాపురం డివిజన్ నాయకులు డి సోమయ్య అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వర్లు, మిరియం వెంకటేశ్వర్లు, జాలా అంజయ్య, సయ్యద్ హనీఫ్, జిల్లా కార్యవర్గసభ్యులు గాలి వెంకటరామిరెడ్డి, జివి శేషయ్య, వెంకటేశ్వర్లు, ఐద్వా నాయకురాలు కళావతి, డికెఎం రఫీ, తిప్పారెడ్డి, సీపీఐ నాయకులు అందె నాసరయ్య, షేక్ కాశీం తదితరులు పాల్గొన్నారు. ముందుగా కేంద్ర కమిటీ సభ్యులు, సీపీఎం, సీపీఐ బృంద సభ్యులు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించారు.