ప్రకాశం

పశ్చిమ ప్రాంతంలో తీరని తాగునీటి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 17: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీనుండి అతిభారీ వర్షాలు కురిసి వుంటే పశ్చిమప్రాంతంలో తాగునీటి కష్టాలు తీరేవి. కానీ అలాంటి పరిస్థితులు లేకపోవటంతో జిల్లాలోని పశ్చిమప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లోని నాలుగువందల గ్రామాలకు ఇంకా మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు సరఫరా చేస్తూనే ఉన్నారు. కాగా నాగార్జున సాగర్‌నుండి నీటిని విడుదల చేయటంలో సాగర్‌కాల్వల పరిధిలోని 231మంచి చెరువులను ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు నింపనున్నారు. ఈపాటికే 40చెరువులకు సాగర్‌నీరు చేరింది. జిల్లాలోని పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని మంచినీటి చెరువులన్ని సాగర్‌నీటితో కళకలలాడనున్నాయి. ఇప్పటివరకు మంచినీటి సమస్యతో అల్లాడిపోతున్న ఈప్రాంత ప్రజలకు సాగర్‌నీరు వరంగా చెప్పుకోవచ్చు. సాగర్‌నీటితో చెరువులను నింపటంవలన ఆప్రాంతాల పరిధిలో భూగర్భజలాలు పెరిగే అవకాశాలున్నాయి. అదేవిధంగా జనాభాతోపాటు పశువులకు కూడా నీటి సమస్య ఈప్రాంతాల్లో తీరనుంది. దీంతో నాగార్జున సాగర్ ఆయకట్టుపరిధిలోని ప్రజలందరు ఊపిరీపీల్చుకుంటుండగా పశ్చిమప్రాంతంలోని పలుప్రాంతాల్లో మాత్రం నీరు లేకపోవటంతో మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుతెన్నులు చూడాల్సిన పరిస్ధితి నెలకొంది. సాధారణంగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసివాగులు, వంకలు పొంగిప్రవహించాల్సిన రోజుల్లో అవన్ని ఎండిపోయి దర్శనమిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్ధితులు ఇంకా కొనసాగితే ఆప్రాంతాల్లోని ప్రజలు మరింతగా నీటి కష్టాలకు ఎదుర్కొవాల్సివస్తుంది. అదేవిధంగా బోర్లుకూడా వట్టిపోయి దర్శనమిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా కొన్ని బోర్లకు నీరువచ్చే పరిస్ధితులు ఉన్నా వాటిని బాగు చేసే నాధుడు లేక ప్రజలు అవస్ధలుపడుతునే ఉన్నారు. ప్రధానంగా వెలిగొండప్రాజెక్టు నిర్మాణం పూర్తిఅయితే మాత్రం మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెంలోని ప్రాంతాలకు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదు. సంక్రాంతి నాటికి వెలిగొండప్రాజెక్టు టనె్నల్ ద్వారా నీటిని విడుదలచేస్తామని రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఇటీవల జిల్లాపర్యటనకు సందర్బంగా ప్రకటించారు. దీంతో పనులు శరవేగంగా జరగనున్నాయని జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు.
కాగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెలిగొండ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. దీంతో వెలిగొండ అంశంపై ఇరుపార్టీలకు ప్రధానాస్త్రంగా మారిందనే చెప్పవచ్చు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిఅయితే మాత్రం జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజలకు తాగు,సాగునీటికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తేఅవకాశాలు ఉండవు.
ఇదిఇలాఉండగా జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజలు ఎక్కువుగా ఫ్లొరైడ్ నీటిని తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా కిడ్నీసమస్యలతో ఆయాప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిఇలాఉండగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోని ప్రజలకు కూడా తాగునీటి కష్టాలు తీరినట్లే. రామతీర్ధం రిజర్వాయరుద్వారా ఒంగోలులోని మంచినీటి ట్యాంకులకు నీటిని విడుదల చేయనున్నారు. దీంతో నగరప్రజల కష్టాలు కూడా సాగర్‌నీటితో తీరినట్లే. కాగా నాగార్జున సాగర్‌నీటిని ప్రణాళిక బద్దంగా చెరువులకు నింపాల్సిన అవసరం ఏంతైనా ఉంది. లేనిపక్షంలో నీటి వృధా జరిగే అవకాశాలున్నాయి. మొత్తంమీద జిల్లాలోని పశ్చిమప్రాంతంలోని పలుప్రాంతాలకు ఇప్పటికి నాలుగువందల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్న దుస్ధితి నెలకొంది.
కాగా జిల్లావ్యాప్తంగా మేఘాలు ఆకాశంలో ముమ్మరంగా కనిపిస్తున్నప్పటికి ఆశించిన స్ధాయిలో మాత్రం వర్షాలు కురవకపోవటంతో రైతన్నలతోపాటు, ప్రజలు వర్షంకోసం ఎదురుతెన్నులుచూడాల్సిన పరిస్ధితి నెలకొంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే అన్నివర్గాల ప్రజలు అన్నింటికి తీవ్ర అవస్ధలు పడే అవకాశాలున్నాయి.