క్రైమ్/లీగల్

బోర్‌వెల్ లారీ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, ఆగస్టు 24: కురిచేడు - పొట్లపాడు మార్గమధ్యలో శుక్రవారం మధ్యాహ్నం బోర్‌వెల్ లారీ బోల్తాపడింది. పొట్లపాడు గ్రామ పరిసరాల్లో పొలాల్లో బోర్లు వేసి కురిచేడువైపు వస్తున్న బోర్‌వెల్ లారీ అదుపుతప్పి పంటపొలాల్లో బోల్తాపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. బోర్‌వెల్ లారీలో పని చేస్తున్న కార్మికులందరూ జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. బరువైన సామగ్రితో బోల్తాపడటంతో లారీకింద ఎవరూ కూరుకుపోకుండా తప్పించుకొని బయటపడటం తమ అదృష్టంగా కార్మికులు భావిస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగనందుకు వారు ఊపిరిపీల్చుకున్నారు.