ప్రకాశం

అత్యాచారాలకు పాల్పడితే కఠినచర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 16 : మహిళలు, బాలికలకపై అత్యాచారాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి హెచ్చరించారు. ఆదివారం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మార్టూరు మండలం వరపర్ల గ్రామానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలికను ఆమె పరామర్శించారు. అదే విధంగా ఈతముక్కల గ్రామానికి చెందిన 19 సంవత్సరాల బాలిక ను ఆమె సఖీ సిబ్బందితో పరామర్శించారు. ఆ బాలికలకు న్యాయం చేస్తామని , నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వరపర్ల గ్రామానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా ఈతముక్కల గ్రామానికి చెందిన 19 సంవత్సరాల బాలికకు ఇప్పటికే పెళ్ళి కుదిరిందని, గతంలో ఆమెతో పరిచయం ఉన్న వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేసి పెళ్ళి చెడగొట్టి అత్యాచారానికి పాల్పడటం దుర్మార్గమన్నారు. ఇలాంటి మృగాలపై ప్రభుత్వం , మహిళా కమీషన్ చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకురావాలని ఆమె సూచించారు. బాధిత బాలికలతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. కిడ్నాప్ యాక్టుల ప్రకారం నిందితులకు శిక్షలు పడేలా చూస్తామని తెలిపారు. ఫోక్సో యాక్టును వారిపై పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు సఖీ సిబ్బంది తదితరులు ఉన్నారు.