ప్రకాశం

నల్లమలలో వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 17 : నల్లమల అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షం కారణంగా గుండ్లకమ్మకు నీరు చేరింది. గత నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో వర్షం లేకపోవడంతో గుండ్లకమ్మకు నీరు చేరిన దాఖలాలు లేవు. మార్కాపురం-కంభం రోడ్డులో బొడిచర్ల వద్ద గుండ్లకమ్మ చప్టాపై నీరు ప్రవహించడంతో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బొందలపాడు చెరువుకు నీరు చేరింది. ఈ ప్రాంతంలో నాలుగేళ్లుగా వర్షాలు లేక వాగులు, వంకలకు నీరు చేరక ఇబ్బందులు పడుతున్న ప్రజలు సోమవారం గుండ్లకమ్మ నదిలో ఐదు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో తండోపతండాలుగా ఆ ప్రాంతానికి చేరుకొని నీటిని చూసి పులకించిపోయారు. ఇలాంటి వర్షాలు ఇంకా కురిసి గుండ్లకమ్మకు నీరు చేరితే మార్కాపురం చెరువుకు కూడా నీరు వచ్చే అవకాశం ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇదిలా ఉంటే మరో మూడురోజుల్లో ఈ ప్రాంతంలో వినాయకస్వామి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఉండటంతో వాగుల్లో నీరు లేదని త్రిపురాంతకం మండలంలోని దూపాడు వద్ద గల సాగర్ కాలువకు విగ్రహాలు తరలించాలని భావిస్తున్న సమయంలో గుండ్లకమ్మకు నీరు చేరడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా గుండ్లకమ్మకు ఇరువైపుల ఉన్న మాల్యవంతునిపాడు, కొండేపల్లి ప్రాంతాల్లో ప్రాజెక్టులకు నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నీటిబొట్టును నిల్వ చేయాలనే ధ్యేయంతో నీరు-చెట్టు పథకం కింద నిర్మించిన చెక్‌డ్యాంలన్నీ నీటితో కళకళలాడుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.