ప్రకాశం

జిల్లాలో ఎరువుల కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 17 : జిల్లాలో ఎరువులకు కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు పివి శ్రీరామ్మూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎరువుల నిల్వలు యూరియా 12 వేల టన్నులు, డిఎపి 7600 టన్నులు, ఎంఓపి నాలుగు వేల టన్నులు, మిశ్రమ ఎరువులు 16వేల టన్నులు, సూపర్ ఫాస్పేట్ 2,300 టన్నులు, ఆమ్మోనియం సల్ఫేట్ 3 వేల టన్నులు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా మార్క్‌ఫెడ్ లో నాలుగు వేల టన్నుల యూరియా, 400 టన్నుల డిఎపిను నిల్వ చేయడం జరిగిందన్నారు. మార్క్‌ఫెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులను అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వ్యవసాయ సంఘాల వారు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన ఎరువులను సరసమైన ధరలకు రైతులకు అందించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎరువుల అమ్మకం పాస్‌మిషన్ల ద్వారా జరుగుతున్నాయని, ఎరువుల డీలర్లు ఆ మిషన్ల ద్వారానే అమ్మకాలు చేయాలని, లేనిపక్షంలో ఎరువుల రాయితీ తయారీదారులకు ఇవ్వడం జరుగదన్నారు. ఎరువులు కొనుగోలు చేసే రైతులు తమ ఆధార్, వేలిముద్రలను మిషన్‌లో నమోదు చేసి తమకు అవసరమైన ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు. రశీదులు కూడా తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. అదనంగా నగదు అడిగితే స్థానిక వ్యవసాయాధికారి లేదా డివిజన్‌స్థాయి సహాయ సంచాలకులకు, తనకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆ విధంగా చేస్తే సంబంధిత డీలర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్సును రద్దు చేస్తామని తెలిపారు.