ప్రకాశం

మార్కాపురం హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 24: జిల్లాలోని మార్కాపురం హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లపై జిల్లా ఎస్పీ బి సత్యఏసుబాబు సస్పెన్షన్ వేటువేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల మార్కాపురం టౌన్ పోలీసుస్టేషన్ మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు గాను స్టేషన్ రైటర్, హెడ్‌కానిస్టేబుల్ అయిన ఏ రామకృష్ణారెడ్డిని కానిస్టేబుల్ బి రాజారావులను వీఆర్‌ఐకు పిలిపించిన విషయం విదితమే. జిల్లా ఎస్‌పి సత్యఏసుబాబు దీనిపై పూర్తి విచారణ జరిపించి నివేదిక ఆధారంగా హెడ్‌కానిస్టేబుల్ ఏ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ బి రాజారావులను విధుల నుండి సస్పెన్షన్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.