ప్రకాశం

మద్యంమత్తులో యువకుడు వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, సెప్టెంబర్ 24: ఫూటుగా మద్యం సేవించిన యువకుడు కొమ్మాలపాడు సెంటర్‌లో సోమవారం రాత్రి వీరంగం సృష్టించాడు. కొబ్బరిబొండాలు నరికే కత్తితో సెంటర్ అంతా గంటపాటు హల్‌చల్ చేసి ఒక దుకాణ యజమానిపై దాడికి పాల్పడి రోడ్డుపై వెళుతున్న కారు అద్దాలు ధ్వంసం చేశాడు. కొమ్మాలపాడుకు చెందిన దుమ్మవలం అప్పారావు ఈ విచిత్రధోరణితో ప్రవర్తించి కూడలిలో అందరిని భయభ్రాంతులకు గురిచేశాడు. వివరాల్లోకి అప్పారావు సోమవారం సాయంత్రం నుండి పూటుగా మద్యం సేవిస్తున్నాడు. రాత్రి సమయంకాగానే మద్యం మత్తులో ఉన్న అప్పారావు సెంటర్‌లో కొబ్బరి బొండాలు విక్రయించుకునే బండిపైనున్న కత్తి అందుకుని వీరంగం చేశాడు. కేకలు వేసుకుంటూ స్థానికులను బండబూతులు తిట్టుకుంటూ సెంటర్‌లోని మీరాసాహెబ్ దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ అప్పారావు కేకలకు మీరాసాహెబ్ కుమారుడు వాదులాడుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న అప్పారావు కొట్టుముందు విక్రయించుకునేందుకు ఉంచిన లూజు పెట్రోలు డబ్బా అందకుని దుకాణానికి నిప్పు పెడతానంటూ పెట్రోలు చిమ్మాడు. అంతలో అందరూ అక్కడకు చేరి అప్పారావును నెట్టి వేయడంతో తిరిగి రోడ్డు మీదకు వచ్చాడు. కుందుర్రు వైపు నుండి వస్తున్న కారుకు అడ్డు తగిలి కత్తితో కారు అద్దాలు పగులగొట్టాడు. గంటపాటు కొమ్మాలపాడు సెంటర్‌లోని వారందరిని భయబ్రాంతులకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కొమ్మాలపాడు వచ్చి నిందితుడైన అప్పారావును అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు.