ప్రకాశం

చినుకు రాలదు..సాగర్ నీరు అందదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, అక్టోబర్ 14 : ఖరీఫ్ పంటలు సాగుచేసిన రైతుల ఆనందం ఆవిరవుతోంది. రబీకి సిద్ధమవుతున్న రైతుల పరిస్థితి అయోమయంలో పడింది. వెరసి అన్నదాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. నెలరోజులకు పైగా వరుణుడు చినుకు రాలడంలేదు. సాగర్ జలాలు సాగుకు ఇస్తున్నా అవీ అరకొరగానే వస్తున్నాయి. ఆపై ఎండలు వేసవిని తలపిస్తుండటంతో సాగర్ ఆయకట్టు సాగు కూడా సాగడంలేదు. ఖరీఫ్‌లో సాగుచేసిన పైర్లన్నీ ఎండుముఖం పట్టాయి. వరిచేలు నీరులేక వాడిపోతున్నాయి. రబీ సాగు కోసం పోసిన నారుమళ్లు నీటితడులు అందక నోర్లు తెరుస్తున్నాయి. ఈ ఉడాది అంతా సవ్యంగా ఉందనుకున్న రైతులు ఇప్పుడేమి చేయాలో తోచక సతమతం అవుతున్నారు.
అద్దంకి బ్రాంచి కెనాల్ సాగర్ జలాలు 18/0 మైలు వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తాయి. బ్రాంచి కెనాల్ ఆయకట్టు ఆరుతడి, మాగాణి మొత్తంగా ఒక లక్షా 65వేల ఎకరాలు ఉంది. ఇక చెరువులు సాగర్ నీరు ఆధారంగా, పారే వాగులు వంకల కింద మరో లక్ష ఎకరాలు సాగవుతుంది. గత నెలరోజులుగా చినుకు రాలకపోవడం, ఎండలు మండుతుండటంతో మెట్టపైర్లు ఎండిపోతుండగా మగాణి నీటి తడులు అందక ఎదుగుదల లేకపోవడంతోపాటు కలుపు పెరుగుతోంది. రబీ సాగు కోసం పోసిన నారుమళ్లు నీటితడులు అందక నోర్లు తెరుస్తున్నాయి. నీరు అందించలేమంటూ సాగర్ అధికారులు చేతులెత్తేసారు. ఖరీఫ్ సాగుకు ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతుల చేలు నిలువునా ఎండిపోతుంటే ఏమి చేయాలో తోచక తల్లడిల్లిపోతున్నారు.
రైతుల ఆశలపై పిడుగుపాటు
* సాగర్ జలాలు నెలకు 20రోజులే
అసలే ప్రకృతి సహకరించకపోవడం, సాగర్ జలాలు అందకపోవడం తదితర సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ఇది పిడుగులాంటి వార్తే. సాగర్ జలాలను ఇక నుంచి ప్రతి పదిరోజులకు నిలిపివేసి పదిరోజులపాటు తరువాత విడతలవారీగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సాగునీటి విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడితే సాగునీటి ఉద్యమాలు రోడ్డెక్కే ప్రమాదం ఉంది.
పదిరోజులకోసారి సాగర్ జలాలు నిలిపివేత
* నెహ్రూబాబు, తహశీల్దార్, సంతమాగులూరు
సాగర్ జలాల వినియోగ క్రమబద్దీకరణలో భాగంగా ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ నెల 18 నుంచి కాలువలకు నీటి విడుదల నిలిపివేస్తారని, తిరిగి 28వ తేదీన నీటిని విడుదల చేస్తారు. ఇక నుంచి ప్రతి పదిరోజులకు ఒక పదిరోజులు నీటి విడుదల నిలుపుదల ఉంటుంది. ఈ విషయం పైర్లు సాగు చేసే రైతులు తెలుసుకోవాలి. ఈ మేరకు ఆదివారం అధికారిక సమాచారం వచ్చిందని తహశీల్దార్ నెహ్రూబాబు తెలిపారు..