గుంటూరు

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎనలేనివి: కలెక్టర్ శశిధర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 14: పోలీసు అమరవీరుల త్యాగాలు ఎనలేనివని, వారిని ఆదర్శంగా తీసుకుని యువత, పోలీసులు ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఐజి కెవివి గోపాలరావు పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గుంటూరు అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు ఆధ్వర్యాన నగరంలోని జేకేసీ కళాశాల నుండి పోలీసు పెరెడ్ గ్రౌండ్‌వరకు 5కె మినీ మారథాన్‌ను స్ఫూర్తివంతంగా నిర్వహించారు. తొలుత జేకేసీ కళాశాల వద్ద అతిథులు బెలూన్లను గాలిలోకి వదిలి మారథాన్‌ను ప్రారంభించారు. కలెక్టర్ శశిధర్, ఐజి గోపాలరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. తొలుత అమరవీరులకు అతిథులు అంజలి ఘటించారు. జేకేసీ కళాశాల మైదానంలో పోలీసు అధికారులు, సిబ్బంది, అతిథులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను వివిధ కళాశాలల విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఐదు కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ముందుగా చేరుకున్న పోలీసు శాఖకు చెందిన ముగ్గురితో పాటు, మరో ముగ్గురికి ఈనెల 21న జరిగే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు అర్బన్ ఎస్‌పి విజయారావు తెలిపారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్, రైల్వే డిఆర్‌ఎం విజి భూమా, జిల్లా రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు, కేరళ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ సుబ్బారావు, తుళ్లూరు ఎఎస్‌పి కృష్ణారావు, సిఐడి అడిషనల్ ఎస్‌పి కేజీవీ సరిత, ఐటిసి జిఎం రంగరాజన్, అర్బన్ ఎఎస్‌పిలు వైటి నాయుడు, లక్ష్మీనారాయణ, రాఘవ, డిఎస్‌పిలు గాదె శ్రీనివాసరావు, గోగినేని రామాంజనేయులు, దేవరకొండ ప్రసాద్, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దళవాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.