ప్రకాశం

సిఎం పర్యటన సజావుగా సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జనవరి 2: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 4వ తేదీన మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో జరిగే జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సందర్భంగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖమంత్రి శిద్దా రాఘవరావు శనివారం సాయంత్రం పర్యవేక్షించారు. ఏర్పాట్లపై జిల్లాకలెక్టర్ సుజాతశర్మ, జిల్లాఎస్పీ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, అదనపు కలెక్టర్ రాంప్రకాశ్‌తోపాటు మార్కాపురం టిడిపి ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డిని కోరారు.