ప్రకాశం

కార్పొరేషన్ల రుణ లక్ష్యాలను 21లోగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 17 : బ్యాంకు అధికారులు వివిధ కార్పొరేషన్ల ద్వారా వారికి నిర్దేశించిన రుణ లక్ష్యాలను శనివారం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సుజాత శర్మ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక సిపివో సమావేశ మందిరంలో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. బ్యాంకర్లు రైతులకు పంటరుణాలు అందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యతారంగంలో రుణ లక్ష్యాల పురోగతి ఆశించినంతగా లేదన్నారు. రానున్న మూడుమాసాల్లో లక్ష్యాలను సాధించడానికి బ్యాంకు అధికారులు కృషి చేయాలన్నారు. గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక మేరకు రుణాలు మంజూరు చేసిన అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా బ్యాంకు అధికారులు సహకారం అందించి రైతులకు వివిధ వర్గాల ప్రజలకు మేలు జరిగేలా అండగా నిలబడాలని సూచించారు.ప్రాధాన్యతా రంగంలో పంట రుణాలు, అగ్రికల్చక్ టర్మ్ లోన్స్ అందించే విషయంలో ఎస్‌బిఐ, ఆంధ్రా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, పిడిసిసి బ్యాంకు నిర్థేశించిన లక్ష్యాలను అధిగమించాయని , ఇతర బ్యాంకులు కూడా తమ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలన్నారు. ఎస్‌బిహెచ్ వంటి పెద్ద బ్యాంకు నిర్ధేశించిన లక్ష్య సాధనలో వెనుబడి ఉందన్నారు. త్వరలో ప్రజాప్రతినిధులు, బ్యాంకర్లు, అధికారులతో డిఎల్‌ఆర్‌సి సమావేశం నిర్వహించడానికి తీర్మానించినట్లు చెప్పారు. జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సూచనలు, వివరాలు సమావేశానికి హాజరుకాని బ్యాంకు మేనేజర్లకు సమాచారం అందడం లేదని దీనిపై దృష్టి సారించాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఎస్‌హెచ్‌జిలకు అందించే బ్యాంకు లింకేజి 777.44 కోట్లు లక్ష్యం కాగా మార్చి 2016 నాటికి 939.44 కోట్లు లక్ష్యానికి చేరి రాష్ట్రంలో ఐదోస్థానంలో ఉన్నామని, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టరు సమావేశంలో జిల్లా కలెక్టర్‌కు వివరించారు. 2016-17 సంవత్సరానికి 862.13 కోట్లు రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాకలెక్టర్ నిరర్థక ఆస్తులు (నాన్ ఫర్‌ఫార్మన్స్ అసెట్స్)పై బ్యాంకుల వారీగా సమీక్షించారు. అత్యధికంగా ఎన్‌పిఎ శాతం ఎస్‌బిఐలో ఉందని రికవరీకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎన్‌పిఎ శాతం తగ్గించాలన్నారు. స్వయం సహాయక గ్రూపులు విడిపోవడం వలన రుణాలు సక్రమంగా కట్టకపోవడం వలన ఎన్‌పి పెరుగుతుందని, మేడపి, చీమకుర్తిలో డిపాల్టింగ్ ఎస్‌హెచ్‌జి గ్రూపులున్నాయని ఆంధ్రబ్యాంకు రీజనల్ మేనేజర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ మేడపి, చీమకుర్తిలలో గల ఎస్‌హెచ్‌జి గ్రూపుల డేటా తీసుకొని విచారణ చేపట్టాలని బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ డిఆర్‌డిఎ పిడి మురళిని ఆదేశించారు. డి ఆర్‌డి ఏ అధికారులు ఎస్‌హెచ్‌జి గ్రూపు మహిళల నుండి తీసుకున్న రుణాలు రీ పేమెంటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎన్‌సిఎం శాతం 4.55 ఉందని, దానిని రెండు కంటే తక్కువ వచ్చేలా బ్యాంకు అధికారులు దృష్టి పెట్టాలన్నారు. మండల స్థాయిలో జరిగే జెఎల్‌ఎంబిసి సమావేశంలో ఎంపిడివో, తహశీల్దారు, ఎస్‌హెచ్‌జి గ్రూపు మహిళలు, లైన్ డిపార్టుమెంట్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేటట్లు చూడాలని సమస్యలను అక్కడే చర్చించి పరిష్కారం పొందాలన్నారు. ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ శాఖలలో ఎంపికైన లబ్ధిదారులను యూనిట్‌ల గ్రౌండింగ్ విషయానికి సంబంధించి బ్యాంకులలో రుణ ఖాతాలు తెరిచేలా చూడాలని సంబంధితశాఖల అధికారులకు సూచించారు. బ్యాంకు అధికారులు యూనిట్లు గ్రౌండింగ్ అయిన వాటికి సంబంధించిన యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు, ఫొటోలు 15 రోజుల లోపుగా అందివ్వాలని కలెక్టర్ బ్యాంకు అధికారులకు సూచించారు. బ్యాంకు ఖాతాలు తెరిచే విషయంలో అధికారులు బ్యాంకర్లు మిషన్ మోడ్‌లో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ క్రింద సుమారు 25 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉందని ఆర్‌బిఐ ఎజిఎం శ్రీహరి శంకర్ తెలిపారు. ఫసల్ భీమాయోజన పథకంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఫైనాల్షియల్ లిటరసీపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం గురించి సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మత్స్య శాఖ, పశు సంవర్థక శాఖలలో బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారుల జాబితాను సంబంధిత బ్యాంకు అధికారులకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిసిసి సమావేశంలో ఆర్‌బిఐ ఎజిఎం శ్రీహరి శంకర్, సిండికేట్ బ్యాంకు ఎజిఎం మెహంతి, ఎల్‌డియం నరసింహారావు, నాబార్టు ఎజిఎం జ్యోతి శ్రీనివాస్. డిఆర్‌డిఎ పిడి మురళి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి, డాక్టర్ బి రవి, మైనార్టీ ఈడి విజయ్‌కుమార్, బిసి కార్పొరేషన్ ఈడి ఎ నాగేశ్వరరావు, డిపిఎం సుబ్బారావు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.