ప్రకాశం

ప్రకాశం పంతుల ఆశయాల సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 20: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాల సాధనకు అన్నివిధాల కృషిచేస్తామని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ పేర్కొన్నారు. శుక్రవారం ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా జిల్లాకలెక్టర్ సుజాతశర్మ, జిల్లా ఎస్‌పి సిఎం త్రివిక్రమ్‌వర్మ ప్రకాశం భవనంలోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ అధికారులు, సిబ్బందితో కలిసి రెండునిమిషాలు వౌనం పాటించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం పంతులు గొప్ప మహానీయులని వారు తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జిల్లాకే గర్వకారణమన్నారు. ఆయన దేశంకోసం, రాష్ట్రప్రజల సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన ధీరోదాత్తులన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ఆయన ఎంతగానో పాటుపడ్డారన్నారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. రాష్ట్రం, జిల్లా అభివృద్ధికి మనవంతు కృషిచేసేందుకు అందరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్, జిల్లా రెవిన్యూ అధికారి నూర్‌భాషాఖాసీం, ఒంగోలు డిఎస్‌పి శ్రీనివాసరావు, సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు ఎం వెంకటేశ్వరప్రసాదు పాల్గొన్నారు.