ప్రకాశం

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ‚ ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,నవంబర్ 12:రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిందని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. సోమవారం స్థానిక ఒంగోలు మినీస్టేడియంలో పేదరికంపై గెలుపు ఆదరణ-2 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్టస్థ్రాయిలో నాలుగువేల కోట్లరూపాయతో ఎనిమిది లక్షల యూనిట్లు పంపిణీ చేసి ప్రభుత్వం చరిత్రలోనిలిచిందన్నారు. గత ప్రభుత్వాలు ఎస్‌సి ప్రజల కోసం కేటాయించిన నిధులను దారి మళ్ళించారని,తమప్రభుత్వం బలహీన వర్గాల ప్రజలకోసం బడ్జెట్‌లో అదనంగా నిధులను కేటాయించటం జరిగిందన్నారు. భారతదేశంల ఏ రాష్ట్రప్రభుత్వం చేయలేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలుచేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 8779మంది లబ్ధిదారులకు 70కోట్లరూపాయల యూనిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ వి వినయ్‌చంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదప్రజలకు ప్రతినెల పదివేల రూపాయలు ఆదాయం కల్పించే దిశగా ప్రభుత్వం ఆదరణ-2 పథకాన్ని అమలుచేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం సంక్షేమ పథకాలనుల సమర్ధవంతంగా అమలుచేసేందుకు ఐదుగ్రిడ్లు, ఏడుమిషన్లను ముఖ్యమంత్రి ఏర్పాటుచేయటం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎస్‌సి,ఎస్‌టి, బిసి, కాపు, మైనార్టీ, బ్రాహ్మాణ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయటం జరుగుతుందన్నారు. జిల్లాలో 2016-17,2017-18, 18-19 సంవత్సరాలకు సంబంధించి సంక్షేమ శాఖల ద్వారా రుణాల గ్రౌండింగ్ సంక్రాంతి పండగ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. సంక్షేమశాఖల ఆదరణ పధకం ద్వారా లబ్ధిదారులకు నాలుగుదశల్లో రుణాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసకున్నామన్నారు. జిల్లాలో ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్‌స్థాయిలో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, శాసనమండలి సభ్యులు కరణం బలరాం, అద్దంకి, కొండెపి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, జాయింట్‌కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ నిశాంతి, బిసి కార్పొరేషన్ ఇడి నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖాధికారిణి రాజ్యలక్ష్మి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి జగన్నాధరావు, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారులు సిరాజుల్లా, జాన్సీ, స్టెప్ సిఇఒ బి రవి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎం వెంకటేశ్వర్లు సిండికేట్ బ్యాంకు ఎల్‌డిఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.