ప్రకాశం

రానున్న 2019 పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో మాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,నవంబర్ 13:రానున్న 2019 పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని బీజెపీ జిల్లా అధ్యక్షుడు పులి వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని దీంతో అన్నివర్గాల ప్రజలు మోదీ ప్రభుత్వం రావాలని స్వచ్ఛందంగా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని గతంలో మెచ్చుకున్న చంద్రబాబు అనంతరం నాలుగేళ్ల సమయంలోనే మోదీ ప్రభుత్వం విమర్శలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు మహాకూటమీని ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆ కూటమీ మహాకూటమీ కాదని పిచ్చి కూటమనీ ఆయన అభివర్ణించారు. రోజురోజుకు రాష్ట్రంలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుండటంతో మహాకూటమి పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు అసత్యపు ప్రచారాలను కేంద్రప్రభుత్వంపై ఆరోపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కేంద్రప్రభుత్వంతో టీడీపితో పొత్తు ఉన్న సమయంలో ఏనాడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని ఎన్నడూ చెప్పలేదన్నారు. ప్రత్యేకహోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని మాత్రమే కేంద్రం చంద్రబాబుకు చెప్పిందన్నారు. ప్రత్యేకప్యాకేజిని ప్రకటించిన తరువాత కేంద్రమంత్రులను చంద్రబాబు సన్మానించటం జరిగిందని, ఇది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.
జిల్లా అభివృద్ధి విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని కాని రాష్ట్రప్రభుత్వం సహాయసహకారాలు అందించటం లేదని కృష్ణారెడ్డి విమర్శించారు. జిల్లాలో రామాయపట్నం మేజర్‌పోర్టును ఏర్పాటుచేసేందుకు వీలుగా కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ఒక లేఖను కూడా పంపలేదన్నారు. కనిగిరిలో నిమ్జ్ ఏర్పాటుచేసేందుకు కేంద్రప్రభుత్వం ఇప్పటికి ఏడుసార్లు లేఖలను రాష్ట్రప్రభుత్వానికి పంపించటం జరిగిందని,కాని ప్రభుత్వంనుండి ఏలాంటి స్పందన లేదన్నారు.జిల్లాలో వెలుగొండప్రాజెక్టును పూర్తిస్ధాయిలో నిర్మించేందుకు కూడా కేంద్రం సానుకూలంగా ఉందన్నారు.దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటులోను కేంద్రం సానుకూలంగా ఉన్నా రాష్ట్రంనుండి సరైన స్పందనలేదని ఆయన ధ్వజమెత్తారు. కాని రాష్టమ్రుఖ్యమంత్రి మాత్రం ధర్మపోరాట దీక్షల పేరుతోదీక్షలు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రతి ఎన్నికల్లోను ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుని గెలవటమే కాని, ఒంటరిగా పోటీచేసే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు.
రానున్న అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమపార్టీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని కృష్ణారెడ్డి వెల్లడించారు. జిల్లాలో తమపార్టీకి బలమైన క్యాడర్ ఉందని అందువలనే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలుపొందిందని ఆయన గుర్తు చేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బూత్‌స్థాయి నుండి కమిటీలను ఏర్పాటుచేయటం జరిగిందన్నారు. మండల కమిటీలను కూడా బలోపేతం చేస్తున్నామని, అదేవిధంగా గ్రామ, మండలస్థాయిల్లో మోర్చాకమిటీలను సైతం బలోపేతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో జిల్లావ్యాప్తంగా 50వేలమందికి పార్టీ సభ్యత్వం ఉండగా ప్రస్తుతం రెండున్నర లక్షలమందికి పార్టీ సభ్యత్వం ఉందని, ఈసభ్యత్వం రోజురోజుకు పెరుగుతు ఉందని ఆయన వెల్లడించారు. జన్మభూమి కమిటిలనుండి అన్నికమిటీల వరకు కుంభకోణాల మయంగా మారాయని ఆయన ధ్వజమెత్తారు. అధికారపార్టీ నాయకులు అధికారులను అడ్డంపెట్టుకుని ప్రజాధనాన్ని పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. త్రిపురాంతకం ఒక్క మండలంలోనే 15కోట్లరూపాయల అవినీతి జరిగిందని, అదేవిధంగా పుల్లలచెరువు మండలంలో మొక్కలు నాటకుండానే ఆరువందల ఎకరాల్లో మొక్కలు నాటినట్లు నగదును తెలుగుతమ్ముళ్ళు డ్రాచేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఆరోణపలు చేస్తుందని ఆయన ఆరోపించారు. మొత్తంమీద జిల్లాలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయటమేకాకుండా రాష్ట్రంలో తమపార్టీ బలీయమైన పార్టీగా అవతరిస్తుందని బీజెపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి వెల్లడించారు.