ప్రకాశం

రాష్ట్రంలో జాతీయస్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,నవంబర్ 13:రాష్ట్రంలో జాతీయస్థాయి క్రీడలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. మంగళవారం స్థానిక రైజ్ కృష్ణసాయి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజిలో 39వ ఏపి స్టేట్ సబ్ జూనియర్, 37వ ఏపి స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ తైక్వాండో చాంపియన్‌షిప్ -2018 పోటీలను ఆయన జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. క్రీడలు ప్రతిఒక్కరికి ఆరోగ్యానికి అవసరమన్నారు. క్రీడల వలన శారీరక బలం, మానసికంగా బలంగా ఉంటారన్నారు. ముఖ్యమంత్రి ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు జాతీయ క్రీడలను హైదరాబాద్‌లో నిర్వహించారన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని నియోజకవర్గాల్లో మూడుకోట్లరూపాయలతో మినీస్టేడియాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రెండుశాతం రిజర్వేషన్లు కల్పించటం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయస్థాయిలో క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చిన గోపిచంద్, పివి సింధుకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందన్నారు. ఒంగోలులో జాతీయస్థాయి క్రీడాపోటీలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తైక్వాండో క్రీడాకారులు అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కరణం బలరాం, రైజ్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కాలేజి సెక్రటరీ శిద్దా హనుమంతరావు, ఏపి ఒలింపిక్స్ అసోసియేషన్ చైర్మన్ పున్నయ్యచౌదరి, జిల్లా పెన్సింగ్ అసోసియేషన్ చైర్మన్ బాలిశెట్టి నాగేశ్వరరావు, ఏపి ఒలింపిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అచ్యుతరెడ్డి, సలహాదారులు ఇమ్మిడి సత్యనారాయణ, జిల్లి ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె భాస్కరరావు, జిల్లా తైక్వోండో సెక్రటరి చెరుకూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.