ప్రకాశం

మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 17 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని రానున్న ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని రాష్ట్ర అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు బూత్ కన్వీనర్లుకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎ-1 ఫంక్షన్ హాలులో దర్శి నియోజక వర్గ పరిధిలోని దర్శి, ముండ్లమూరు మండలాలకు చెందిన బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్ద పీఠ వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. దర్శి నియోజకవర్గ పరిధిలో మూడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామన్నారు. దొనకొండలో మెగా పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారన్నారు. దొనకొండకు పరిశ్రమలు వస్తే చుట్టుపక్కల ప్రాంతాలు వేగవంతంగా అభివృద్ది చెందుతాయన్నారు. రామాయపట్నం ఓడరేవుకు ముఖ్యమంత్రి త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. జిల్లాలో 26 వేల కోట్ల రూపాయలతో పేపర్ మిల్లు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కందుకూరు జడ్పిటిసీ కె శ్రీకాంత్ బూత్ కన్వీనర్ల కు ఎన్నికలు, ఓటర్ల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీపీపూసల సంజీవయ్య, దర్శి మండల పార్టీ అధ్యక్షులు నారపుశెట్టి పిచ్చయ్య, ముండ్లమూరు ఎంపీపీ మందలపు వెంకట్రావు, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాసరావు, ముండ్లమూరు జడ్పిటిసీ కొక్కెర నాగరాజు, జిల్లా టీడీపీ కార్యవర్గ సభ్యులు వి పౌలు, కనీస వేతనాల అమలు బోర్డు డైరెక్టర్ శోభారాణి, ముండ్లమూరు, పోలవరం, నాయుడుపాలెం, జమ్మలమడక గ్రామాల మాజీ సర్పంచులు ఎం వెంకట్రావు, ఎం మల్లికార్జున్‌రావు, బి గోపాల్‌రెడ్డి, సిహెచ్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.