ప్రకాశం

కందిపంట నష్టపరిహారంలో ఏవో అవకతవకలపై రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపూడి, నవంబర్ 18: కందిపంట నష్టపోయిన మండలంలోని రైతులకు ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద సుమారు ఏడుకోట్లరూపాయలు మంజూరు చేసింది. కానీ ఈ ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో వ్యవసాయశాఖ అధికారి అవకతవకలకు పాల్పడుతున్నాడంటూ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు పలు సందర్భాల్లో ఆరోపించారు. ఇటీవల మండల పర్యటనకు వచ్చిన కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామికి టీడీపీకి చెందిన మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఏవోపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రప్రభుత్వం రైతుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుంటే వ్యవసాయశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. 17-18సంవత్సరానికి వచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీలో 60శాతానికి పైగా రైతుల అకౌంట్లల్లో జమచేశారని, మిగిలిన 40శాతం విషయంలో జాప్యం చేస్తూ రైతులకు వచ్చిన పరిహారాన్ని తగ్గించి బినామీ అకౌంట్లకు వేసేందుకు ఏవో ప్రయత్నిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. 25వేలరూపాయలు వచ్చిన రైతుకు 12వేల రూపాయలు మాత్రమే జమచేశారని మర్రిపూడి చెందిన సురేష్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరా ఉన్న రైతుకు 13వేల రూపాయలు అకౌంట్‌లో వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా 40శాతం రైతులకు రావాల్సిన పరిహారాన్ని కొంతమాత్రమే రైతులకు జమచేసి మిగిలిన మొత్తాన్ని బినామీ అకౌంట్లల్లో వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ రైతులకు ఇవ్వాల్సిన వ్యవసాయ పనిముట్లలో కొన్ని ఓసీలకు ఇచ్చారని పలువురు ఎస్సీ రైతులు ఆరోపించారు. ఈ విషయంపై దర్శి వ్యవసాయశాఖ ఏడీఏ నాయక్‌ను వివరణ కోరగా ఏవోపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కందిపంట ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. 16-17సంవత్సరానికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ కొంతమంది రైతులకు సకాలంలో ఇవ్వలేకపోయామని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, కొనకనమిట్ల, మర్రిపూడి గ్రామాలకు చెందిన కొందరు రైతులకు సబ్సిడీ ఇవ్వాల్సిన విషయం వాస్తవమేనని, ఈవిషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అందరు రైతులకు పరిహారం ఇవ్వటానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.