ప్రకాశం

జిల్లాలో నీరు -చెట్టు పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 20:జిల్లాలో నీరు -చెట్టు పనులను వేగవంతం చేయాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ నీటిపారుదలశాఖ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తన క్యాంపుకార్యాలయంలో నీటిపారుదలశాఖ ఇంజనీర్లతో నీరు -చెట్టు పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసంవత్సరం జిల్లాలో నీరు -చెట్టు కార్యక్రమం కింద 109కోట్లరూపాయల వ్యయంతో 1697పనులు మంజూరు చేశామన్నారు. అందులో ఇప్పటివరకు 650 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 141పనులు పూర్తిఅయ్యాయన్నారు. తద్వారా 63.75లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని యంత్రాల ద్వారా తొలగించటం జరిగిందన్నారు. అలాగే 3.52లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనులతో చెరువుకట్టలను బలోపేతం చేశామన్నారు. ఇందుకోసం 325ప్రొక్లైన్లను వినియోగించటం జరిగిందన్నారు. ఈనెల 24న ముఖ్యమంత్రి జిల్లాకలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారని ఈలోగా మరింత పురోగతి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే అద్దంకిలో ఐదుపనులకు గాను రెండుపనులు, దర్శిలో 363 పనులకు గాను 131పనులు, గిద్దలూరులో 88కిగాను 24పనులు, కందుకూరులో 163కి గాను 62, కనిగిరిలో 223కి గాను 124, కొండెపిలో 241కి 107పనులు, మార్కాపురంలో 210కి 59, ఒంగోలులో 51కి 21, సంతనూతలపాడులో 119కి 37పనులు, యర్రగొండపాలెంలో 234కి 83పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పనుల పురోగతిలో వెనుకబడిన నియోజకవర్గాల్లో మరింత చొరవతీసుకుని పనులను ముమ్మరం చేయాలన్నారు. రోజువారి నివేదికలను ఇకపై సకాలంలో పంపించాలన్నారు. అలా పంపించని వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న నీరు -చెట్టు పనుల నాణ్యత, పురోగతిపై సంపూర్ణ పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈసమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.