ప్రకాశం

హత్య కేసులో నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, మే 20 : తాళ్లూరు మండలం కొర్రపాటి వారిపాలెంలో మార్చి నెల 6న జరిగిన శ్రీదేవి అనే మహిళ హత్య కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు డిఎస్‌పి వి శ్రీరాంబాబు తెలిపారు. శుక్రవారం డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి శ్రీరాంబాబు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా డిసి పల్లికి చెందిన శ్రీదేవి రామాంజనేయులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్కడి నుండి కొర్రపాటివారిపాలెంలో గత నాలుగు సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్నారని, అయితే రామాంజనేయులు బంధువులకు, శ్రీదేవికి తరచూ విభేదాలు తలెత్తాయని రామాంజనేయులు బంధువైన పులి ఖాదర్ శ్రీదేవి ప్రవర్తను వ్యతిరేకించడంతో పులి ఖాదర్‌కు, అతని మేనకోడలికి అక్రమ సంబంధం ఉన్నట్లు శ్రీదేవి ప్రచారం చేసిందన్నారు. దీంతో ఖాదర్ మేనకోడలిని ఆమె భర్త వదిలేయడంతో శ్రీదేవిపై కక్ష పెంచుకున్న ఖాదర్ రామాంజనేయులు లేని సమయంలో ఆమెను ఇంటి నుండి బలవంతంగా నోట్లో గుడ్డకుక్కి బహిరంగ ప్రదేశానికి లాక్కోనివెళ్ళి హత్య చేశాడన్నారు. రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో పరిశీలించి కేసును ఛేదించారన్నారు. హత్యచేసి పరారైన ఖాదర్ శుక్రవారం తన లాయర్‌తో కోర్టులో లొంగి పోవడానికి వస్తున్న సమయంలో సి ఐ కెవి రాఘవేంద్ర, ఎస్ ఐ మహేష్‌లు అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేసినట్లు ఖాదర్ అంగీకరించడాన్నారు. ఖాదర్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చుతున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ కేసును ఛేదించిన సి ఐ కెవి రాఘవేంద్ర, ఎస్ ఐ మహేష్, ఐడిపార్టీ సిబ్బందిని అభినందించడంతో పాటు వారికి రివార్డులనుకూడా అందించడం జరుగుతుందన్నారు. నిందితుని పై రౌడీ షీటు తెరవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సి ఐ రాఘవేంద్ర, తాళ్లూరు ఎస్ ఐ మహేష్, ఐడి పార్టీ సిబ్బంది తదితరులు ఉన్నారు.